విజయ్ దేవర కొండ-శివనిర్వాణ కాంబినేషన్‌లో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న సినిమా ఖుషీ. ఈ సినిమా థియేటర్ బిజినెస్ క్లోజ్ చేస్తున్నారు. ఒక్క ఆంధ్ర ఏరియానే 22 కోట్ల రేషియోలో మార్కెట్ చేసారు. అంటే విశాఖ ఏరియాకు 5 కోట్లకు పైగా పడుతోంది.
మైత్రీ రెగ్యులర్ బయ్యర్లకే సినిమా ఇచ్చారు. నైజాం ఏరియా మాత్రం స్వంతంగా పంపిణీ చేసుకుంటున్నారు.
ఖుషీ సినిమా మీద చాలా అంచనాలు వున్నాయి. పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. డైరక్టర్ శివ నిర్వాణకు మంచి సక్సెస్ ట్రాక్ రికార్డు వుంది. గీత గోవిందం తరువాత విజయ్ ఎటువంటి స్పెషల్ జానర్ కాకుండా పక్కా లవ్, ఫ్యామిలీ జానర్ లో చేయడం విశేషం. సమంత-విజయ్ పెయిర్ బాగుందని పేరు వచ్చింది.
వీటి అన్నింటి రీత్యా మంచి ఓపెనింగ్ వస్తుందని అంచనాలు వున్నాయి. ఈ సినిమా విడుదలకు ముందు రెండు వారాలు, వెనుక ఒక వారం సరైన సినిమా థియేటర్లో లేదు. ప్రస్తుతం థియేటర్లు టైట్ గానే వున్నాయి కానీ ఖుషీ వేళకు ఖాళీ అవుతాయి. అందువల్ల మాగ్జిమమ్ ఓపెనింగ్ వుండొచ్చు. ఏ మాత్రం బాగున్నా ముందుకు వెళ్తుంది.