ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్‌తో ఢిల్లీ బ్యూటీ కిమ్‌శర్మ డేటింగ్లో ఉంది. ఈ వార్తలకు బలం చేకూర్చేలా లియాం డర్‌తో తాజాగా ఆమె దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం విశేషం.
40 ఏళ్ల కిమ్‌శర్మ టాలీవుడ్ ప్రేక్షకులకి సుపరిచితురాలే. ‘మగధీర’లో ‘ఏం పిల్లడూ..’ అంటూ స్టెప్పులు, అలాగే ఖడ్గం సినిమాలో ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద…’ అంటూ తన ఆకట్టుకునే హావభావాలతో కుర్రకారు గుండెల్లో మత్తెక్కించే అందాల భామ కిమ్శర్మను మరిచిపోవడం ఎలా సాధ్యం!
లియాండర్ పేస్, కిమ్‌శర్మ ప్రేమ జంట తాజాగా గోవా బీచ్‌లో ఆకాశమే హద్దుగా చెట్టపట్టాలేసుకొని తిరుగుతూ కెమెరాకు ఫోజులిచ్చారు. సదరు ఫొటోలను ఈ జంట బస చేసిన హోటల్ సోషల్ మీడియాలో విడుదల చేయడం విశేషం.
అదేంటోగానీ ఈ అందగత్తె క్రీడాకారులతోనే లవ్ గేమ్ ఆడడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. 2007లో భారత మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్‌తో కూడా కిమ్‌శర్మ డేటింగ్ చేయడం అప్పట్లో విస్తృత చర్చకు దారి తీసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలొచ్చి విడిపోయారు.
యువరాజ్ సింగ్ మరొకరిని పెళ్లి చేసుకున్నారు. కిమ్‌శర్మ మాత్రం 2010లో కెన్యాకు చెందిన వ్యాపారవేత్తను వివాహమాడారు. 2016లో విడాకులు తీసుకున్నారు. కొంత కాలంగా లియాండర్ పేస్‌తో డేటింగ్లో ఉన్నారనే వార్తలకు బలం ఇచ్చేలా తాజాగా గోవాలో ఇద్దరు కలిసి హల్చల్ చేసే ఫొటోలు బలం కలిగిస్తున్నాయి.
లియాండర్ పేస్ గురించి రెండు మాటలు చెప్పుకోవాలి. 48ఏళ్ల లియాండర్ పేస్ ప్రస్తుతం మోడల్ రియా పిళ్లైతో సహజీవనం చేస్తున్నాడు. ఆ ఇద్దరికీ ఒక కూతురు కూడా పుట్టింది. ఈ నేపథ్యంలో కిమ్శర్మతో కలిసి లియాండర్ ప్రేమాయణానికి సంబంధించి ఫొటోలు బయటికి రావడం సంచలనం కలిగిస్తోంది. వీళ్ల ప్రేమ, పెళ్లిళ్లలో స్థిరత్వం లేని నేపథ్యంలో… ఈ ప్రేమ మాత్రం ఎన్నాళ్లో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.