ఆంధ్ర మంత్రి పేర్ని నాని హైదరాబాద్ వస్తున్నారు. ఆయన ఏ పని మీద వస్తున్నారు అన్నది పక్కన పెడితే, ఆయనను కలిసి ఆంధ్రలో సినిమా టికెట్ ల రేట్ల విషయం ముచ్చటించాలని టాలీవుడ్ జనాలు సిద్దం అవుతున్నారు.
ఈ గురువారం సాయంత్రం టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ జనాలు పేర్ని నానిని కలవాలని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ పేర్ని నానిని కలిసినంత మాత్రాన పని అయ్యేటట్లు వుంటే ఎప్పుడో అయిపోయేది.
ఇప్పటికే లోపాయకారీగా పలువురు టాలీవుడ్ జనాలు పేర్ని నానితో మాట్లాడారు కూడా. అయితే టికెట్ రేట్ల మీద ఏదో ఒకటి చేయాలి కనుక హైదరాబాద్ వస్తున్న మంత్రి పేర్ని నానిని కలవాలని సినిమాలు జనాలు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా వుంటే మంత్రి పేర్ని నానిని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి తీసుకెళ్లాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మెగాస్టార్ ఇంట్లో కనుక సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఆ విధంగా చిరు సమక్షంలో టికెట్ రేట్ల పెంపుపై కృషి జరిగిందనే క్రెడిట్ కూడా వస్తుందని ప్రయత్నిస్తున్నట్లు బోగట్టా.
కానీ పేర్ని నాని నేరుగా చిరు ఇంటికి వెళ్తారా? అలా వెళ్తే సిఎమ్ జగన్ కు ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? ఇలాంటి సందేహాలు ఇంకా వుండనే వున్నాయి.