సర్‌ప్రైజ్ ప్లస్ షాక్.. ‘కింగ్ స్టన్’ బడ్జెట్!

ఇండియాస్ ఫస్ట్ సీ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా ‘కింగ్ స్టన్’ తెరకెక్కింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ శుక్రవారం రిలీజవుతోంది.

జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించి, నిర్మించిన ‘కింగ్ స్టన్’ ట్రైలర్, ప్రమోషనల్ మెటీరియల్ మీద హీరో నితిన్ నుంచి దర్శకులు వెంకీ కుడుముల, వెంకీ అట్లూరి, మైత్రీ రవిశంకర్ వరకు అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది. ఇండియాస్ ఫస్ట్ సీ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా ‘కింగ్ స్టన్’ తెరకెక్కింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ శుక్రవారం రిలీజవుతోంది.

హైదరాబాద్‌లో సోమవారం రాత్రి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దానికి ముఖ్య అతిథిగా వచ్చిన నితిన్, ‘కింగ్ స్టన్’ ఆడియన్స్ అందరికీ విజువల్స్ ఫీస్ట్ ఇస్తుందని చెప్పారు. ట్రైలర్, విజువల్స్ గురించి ఆయన స్పెషల్ గా మాట్లాడారు. ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఇంకెలా ఉంటుందోనని ఆయన ఆసక్తి చూపించారు. తెలుగులో సినిమా విడుదల చేస్తున్న తమ ఫ్యామిలీ ఫ్రెండ్ మహేశ్వర్ రెడ్డికి లాభాలు రావాలని ఆకాంక్షించారు.

‘కింగ్ స్టన్’ టీజర్ ఏడెనిమిది నెలల క్రితం చూసినప్పుడు జీవీ ప్రకాష్ కుమార్ చెప్పిన బడ్జెట్ విని షాక్ అయ్యామని మైత్రి రవిశంకర్ పేర్కొన్నారు. ‘లక్కీ భాస్కర్’ డైరెక్టర్ వెంకీ అట్లూరి, నితిన్ ‘రాబిన్ హుడ్’ డైరెక్టర్ వెంకీ కుడుముల సైతం ఆ విజువల్స్, బడ్జెట్ గురించి మాట్లాడారు. ఇండియాలో విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ‘కింగ్ స్టన్’ డిస్కషన్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ మంచి బజ్ తీసుకొచ్చింది. సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

2 Replies to “సర్‌ప్రైజ్ ప్లస్ షాక్.. ‘కింగ్ స్టన్’ బడ్జెట్!”

Comments are closed.