పవన్‌తో గేమ్స్ ఆడొద్దు!

కూటమి అంతా కలిసి ఒకేసారి పేర్లు ప్రకటించకుండా జనసేన నేరుగా ప్రకటించడం అంటే తెలుగుదేశంలోని ఎవరో తమ అనుకూల మీడియా ద్వారా చేస్తున్న ప్రచారానికి పవన్ గట్టి బ్రేక్ వేసినట్లే.

పవన్ కళ్యాణ్ రాజకీయం ఆట మామూలుగా ఉండదు. చంద్రబాబు ఎలా అంటే అలా వింటున్నారు. “మరో పదిహేనేళ్లు చంద్రబాబే సీఎం” అని అంటున్నారు. “వన్ థర్డ్ పదవులు తీసుకుందాం” అని చెప్పి ఇప్పుడు సైలెంట్ అయ్యారు కదా! ఏవి పడితే వాటికి లొంగిపోతారు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. పవన్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ఏనాడో అధికారికంగా, లెటర్ హెడ్స్ మీద ప్రకటించారు చంద్రబాబు.

అప్పటి నుంచి నాగబాబుకు మంత్రి పదవి అన్నది అలా వార్తల్లోనే ఉండి వస్తోంది. ఇప్పుడు ఒకేసారి అయిదు ఎమ్మెల్సీ పదవులు అందుబాటులోకి వస్తున్నాయి. అందువల్ల “నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఫిక్స్” అని వార్తలు వినిపించాయి. జస్ట్ వన్ డే ముందు అసెంబ్లీలో పవన్-చంద్రబాబు మంతనాలు జరిపారు. “నాగబాబుకు ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఫిక్స్” అని వార్తలు వినిపించాయి.

కానీ మంగళవారం రాత్రి నుంచి సీన్ మారినట్లు వార్తలు రావడం మొదలైంది. అదికూడా తెలుగుదేశం హార్డ్‌కోర్ మీడియాలో. “ఎమ్మెల్సీ వద్దని పవన్‌నే చెప్పారని, కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఓకే అన్నారని” ఈ వార్తలు కాస్త కలకలం రేపాయి. ఎవరైనా ఎమ్మెల్సీ, మంత్రి పదవి వద్దు, కార్పొరేషన్ చైర్మన్ పదవి కావాలని అంటారా?” అనరు, కాక అనరు. కావాలంటే “ఎమ్మెల్సీ బదులు ఎంపీ కావాలి” అనొచ్చు. అందుకే ఏదో జరుగుతోందన్న అనుమానాలు వినిపించడం మొదలైంది.

ఈ నేపథ్యంలో జనసేన అధికారిక హ్యాండిల్‌లో ఒక ప్రకటన వచ్చేసింది. “జనసేన తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును పవన్ కళ్యాణ్ డిసైడ్ చేసారు” అని. ఇది చిన్న విషయం కాదు. జనసేనకు ఉన్న సీట్ల సంఖ్యతో నాగబాబు ఎమ్మెల్సీ కావడానికి కొంత వరకు అవకాశం ఉంది. కానీ కూటమి అంతా కలిసి ఒకేసారి పేర్లు ప్రకటించకుండా జనసేన నేరుగా ప్రకటించడం అంటే తెలుగుదేశంలోని ఎవరో తమ అనుకూల మీడియా ద్వారా చేస్తున్న ప్రచారానికి పవన్ గట్టి బ్రేక్ వేసినట్లే. “మీరు ఇవ్వకపోతే తామే సాధించుకుంటాం” అని చెప్పినట్లే.

ఇక ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి తప్పదు. ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందే. మంత్రి పదవి, ఏ మంత్రి పదవి అన్నది చంద్రబాబు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. “కూటమిలో తాను మరీ ఒదిగిపోయి, అణిగిపోయి ఉండనని, అవసరమైతే స్వంత నిర్ణయం తీసుకుంటా” అని పవన్ ఈ విధంగా చిన్న హెచ్చరిక జారీ చేసారు. దీని వల్ల ఇకపై తెలుగుదేశం మీడియాను ముందుకు తోసి, రాజకీయం ఆడే వర్గం సైలెంట్ కావడానికి అవకాశం ఉంది.

అంతేకాదు, “పదేళ్లు, పదిహేనేళ్లు కూటమి పాలన” అనేది టేకిట్ గ్రాంటెడ్ కాదు, షరతులు వర్తిస్తాయి అని పవన్ చెప్పకనే చెప్పినట్లైంది.

29 Replies to “పవన్‌తో గేమ్స్ ఆడొద్దు!”

  1. Ento nee badha. Babu letter head meeda rasi ichaka, inka evaro edo koosarani, adi TDP stand ani nuvvu cheppatam malli janasena daniki virugudu ga letter ichindi anatam, Ata bisibilla bath ratalu.

  2. Haha Ninna nuvve raasav eeroju vere yevado rasaadu antunnav. Nuvvu yentha try chesina yemi udadu. Monnatidaaka inkemundi CBN pawan maatladykovataledu annav. Ippudu tune change ayyindi. Malla inkoti modalu.

  3. JSP కి చాలా ఫ్యూచర్ ఉన్నది. కాని పదవులు కాపులకే ఇచ్చుకొని కాపు పార్టీ అనే ముద్ర వేసుకొంటున్నారు. ఇదే పెద్ద మైనస్ అయ్యంది PRP కి JSP కూడా. కాని వాళ్ళ కాపు కుల ముద్ర నుండి బయటికి రాలేక పోతున్నారు.

    1. We shouldn’t even encourage guys doing caste politics…. if we vote for them, they will keep dividing further…he is only looking for his family first.. aren’t there eligible leaders to be a minister in entire JSP other than his brother?

    2. ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఎవరు, కమ్మ కాదా? జగన్ హయాంలో రెడ్లకి ముఖ్యమైన పదవులు కట్టబెట్టలేదా? అలాంటిది సమీకరణాల్లో భాగంగా తనకు రావాల్సిన ఎంఎల్ఏ సీట్ ను వదులుకున్న నాగబాబు కి సీఎం ఇచ్చిన మాటప్రకారం ఇప్పుడు mlc ఇస్తుంటే

        1. జనసేన సీట్లు ఎన్ని, దాని సమీకరణాలు ఏమిటి, అందులో గెలిచిన మిగతా కులాల వారికి మంత్రి పదవులు ఇస్తే,

  4. ఇదొ GA తిక్క గొల!

    నాగబాబుకి మంత్రి పదవి చంద్రబాబు ఎప్పుదొ ప్రకటించారు అంటారు, మళ్ళి పవన్ హచ్చరిక జారి చెసారు అంటాడు.

    ఇవాళె చూశాం, నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వటం లెదు అని కాసెపు ఎడిచాడు, ఇస్తున్నారు, ఒకటె సామజిక వర్గం అని మరి కాసెపు ఎడిచాడు.

    ఎమి జరిగినా వీడు ఎదొ ఒక కధ చెప్పి ఎడవటం అయితె కాయం!

  5. ఎన్ని పదవులు తెసుకున్నా, ఈ బ్రదర్స్ బాబు, లోకేష్ కిందనే పని చేయాలి. చెప్పింది వినాలి, ఇచ్చింది తెసుకోవాలి. క్లుప్తంగా బానిసగా ఉండాలి. ఇది వాస్తవం.

    1. Why do you guys bring Jagan into everything.. look at the news and comment on it.. I have been watching ur posts since sometime and u link it to ycp no matter what.. what kind of jealousy or enmity is this

  6. ఏమిటో నీ గోల ఏడుపు మొదట ఇన్ని తక్కువ సీట్లు తీసుకుంటే కాపులకి కోపం వస్తుంది అన్నారు..రాజకీయాల్లో వన్ ప్లస్ ఒకటి రెండు ఎవ్వడు అన్నారు….లోకేష్ కోసం పవన్ ని తొక్కేస్తారు అన్నారు కట్ చేస్తే డీ సీఎం ఇచ్చారు…ప్రాధాన్యం లేని శాఖ లు ఇస్తారు అన్నారు..కీలకమైన పోర్ట్ఫోలియో లే పవన్ కి దఖలు పడ్డాయి…తర్వాత మల్ల కాల్ చేస్తే లేపలేదు అన్నారు…కానీ కలిసి కట్టుగానే ఉన్నారు ..ఇలా ఏదోటి రాయడం దానికి బిన్నం గ జరగడం.. ఐన మీకు సిగ్గు లేకపోవడం మాకు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ పీక్స్ కి చేరిపోవడం

  7. ఏమిటో నీ గోల ఏడుపు మొదట ఇన్ని తక్కువ సీట్లు తీసుకుంటే కాపులకి కోపం వస్తుంది అన్నారు..రాజకీయాల్లో వన్ ప్లస్ ఒకటి రెండు ఎవ్వడు అన్నారు….లోకేష్ కోసం పవన్ ని తొక్కేస్తారు అన్నారు కట్ చేస్తే డీ సీఎం ఇచ్చారు…ప్రాధాన్యం లేని శాఖ లు ఇస్తారు అన్నారు..కీలకమైన పోర్ట్ఫోలియో లే పవన్ కి దఖలు పడ్డాయి…తర్వాత మల్ల కాల్ చేస్తే లేపలేదు అన్నారు…కానీ కలిసి కట్టుగానే ఉన్నారు ..ఇలా ఏదోటి రాయడం దానికి బిన్నం గ జరగడం.

  8. అంటే పవన్ సీఎం కే దుమ్కీ ఇచ్చాడంటావ్?

    సీఎం వినకపోతే స్వయంగా నిర్ణయం తీసుకోగలడు అంటావ్.

    మరి అదేంటీ “కౌన్సిలర్ కి ఎక్కువ MLA కి తక్కువ ” అంటున్నారు?

  9. అధఃపాతాళానికి తొక్కాలన్న లేపాలన్న పవన్ అంటావ్ ?

    మరి మీ BOSdk గాడు ఏదో పవన్ మీద కూస్తున్నాడు వాడికి కూడా చెప్పు జీరో కావాలేమో next elections lo ?

    Kelakamakandi doo la teerustadu pawan

Comments are closed.