‘అబ్బవరానికి’ కూడా సిక్స్ ప్యాక్ వేలాం వెర్రి

సరైన కథ, కథనం ఉండేలా చూసుకోవాలి ముందు. అవి ఉంటే ఈ సిక్స్ ప్యాక్‌లు, మూతి ముద్దులు లేకున్నా జనం సినిమాను ఆదరిస్తారు.

సిక్స్ ప్యాక్ అన్నది ఇప్పుడు ఓల్డ్ జమానా ఫ్యాషన్. అల్లు అర్జున్ నుంచి ఆది సాయి కుమార్ వరకు అంతా చేసేశారు. దాని వల్ల ఒరిగింది ఏమీ పెద్దగా లేదు. మంచి ఫిజిక్‌తో ఫిట్‌గా ఉంటే చాలు. పక్కింటి పిల్లాడిగా కనిపిస్తూ, వైవిధ్యమైన కథలు వెదుక్కుంటూ సినిమాలు చేస్తూ వస్తున్న హీరో కిరణ్ అబ్బవరం కూడా ఇప్పుడు సిక్స్ ప్యాక్ అంటూ మోజుపడుతున్నారట. రాజేష్ దండా నిర్మాతగా చేయబోయే సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేస్తానంటున్నారట. అక్కడితో ఆగకుండా లిప్ లాక్ కిస్‌లు ఉండే సీన్లు సినిమా నిండా ఉండేలా చూసుకుంటున్నారని వార్తలు గుప్పుమన్నాయి.

ఈ వార్తలు చదివి సోషల్ మీడియా జనాలు నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. “అవసరమా సిక్స్ ప్యాక్‌లు, మూతి ముద్దులు” అంటూ. ఇంతకు ముందు కూడా కిరణ్ తన సినిమాల్లో కావాలని ఫైట్లు చొప్పించి, అభాసయ్యారు. ఇప్పుడు “దిల్ రుబా” అనే సినిమాలో యాక్షన్ పాలు ఎక్కువ ఉంటుందని ఆయనే చెబుతున్నారు. తనకు ఉన్న ఇమేజ్‌ను ఇలా మాస్ ఇమేజ్గా ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నారో మరి?

సరైన కథ, కథనం ఉండేలా చూసుకోవాలి ముందు. అవి ఉంటే ఈ సిక్స్ ప్యాక్‌లు, మూతి ముద్దులు లేకున్నా జనం సినిమాను ఆదరిస్తారు. ఇప్పటికే విష్వక్ సేన్ కూడా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూ కిందా మీదా అవుతున్నారు. ఆయనే కాదు, చాలా మంది చిన్న, మిడ్ రేంజ్ హీరోలు ఈ మాస్ ఇమేజ్ వెంటపడి ఫెయిల్ అవుతున్నారు. కిరణ్ జాగ్రత్త పడడం అవసరం.

5 Replies to “‘అబ్బవరానికి’ కూడా సిక్స్ ప్యాక్ వేలాం వెర్రి”

Comments are closed.