బాబుకు థాంక్స్ చెప్పిన గాదె!

బాబు సైతం గాదెని అభినందించారు. గాదెతో పాటు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కూడా బాబుని కలిశారు.

ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి విజయం సాధించి కూటమి మద్దతు ఇచ్చిన రఘువర్మను ఓడించిన గాదె శ్రీనివాసులు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి సహకారంతో గెలిచాను అని బాబుకు థాంక్స్ చెప్పారు.

బాబు సైతం గాదెని అభినందించారు. గాదెతో పాటు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కూడా బాబుని కలిశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గాదెకి మద్దతు ఇచ్చిన సంగతి విధితమే. ఆ విధంగా గాదె కూటమి బలపరచిన అభ్యర్థిగానే పరిగణిస్తున్నారు.

ఉత్తరాంధ్రలో కూటమి మద్దతుతో పోటీ చేసిన రఘువర్మ ఓడినా గాదె కూటమి వారే అన్న సంకేతాలను ఈ విధంగా పంపించారని అంటున్నారు. ఎమ్మెల్సీగా ఏ రాజకీయ రంగు లేకుండా గెలిచాను అని ఇప్పటికే చెప్పిన గాదె సీఎం ని కలవడం మర్యాదపూర్వకమే అని అంటున్నారు.

ప్రభుత్వంతో సయోధ్య గా ఉంటేనే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆలోచనతోనే ఆయన ప్రభుత్వ పెద్దలను కలిశారు అని అంటున్నారు. అయితే రానున్న రోజులలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బిల్లులకు గాదె మద్దతు ఇచ్చే విషయం మీదనే ఆయన కూటమి వైపు ఉన్నారా లేదా అన్నది తెలుస్తుందని అంటున్నారు.

అయితే ఉపాధ్యాయ సమస్యల విషయంలో ప్రజా సమస్యల విషయంలో పోరాటం చేయడంతో పాటు ప్రజలకు మేలు చేసే బిల్లుల విషయంలో మద్దతు ఇవ్వడంతో తప్పు లేదన్నది గాదే వర్గీయులు అంటున్న మాట. నిర్మాణాత్మకమైన పాత్రని పోషించడం ద్వారానే ప్రజలతో ప్రభుత్వంతో అనుసంధానం కావచ్చు అన్నది కూడా కొత్త ఎమ్మెల్సీ ఆలోచన అని అంటున్నారు.

6 Replies to “బాబుకు థాంక్స్ చెప్పిన గాదె!”

  1. ఆడ లేక మద్దెల ఓడు అనే సామెత సజ్జల, జెగ్గుల కు అతికినట్టు సరిపోతుంది. ఎన్నికల్లో ఓడిన ప్రతిసారి సజ్జల తమ ఓటర్లు వేరేగా ఉన్నారని అంటాడు. జగ్గుల ఏమో ‘ఈవీఎం అయితే ట్యాంపరింగ్, బ్యాలెట్ అయితే రిగ్గింగ్ అంటూ కబుర్లు చెబుతున్నాడు. సరిపోయారు ఇద్దరికి ఇద్దరు.. #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh https://manatdp.org/feedview/9568/0

  2. ఆ పీడీఎఫ్ అభ్యర్థులకు వైసీపీ సపోర్ట్ చేయకుండా ఉండి ఉంటె.. కనీసం కాస్త ఫైట్ అయినా ఇచ్చేవాళ్ళేమో..

    పీడీఎఫ్ అభ్యర్థులకు వైసీపీ సపోర్ట్ చేస్తున్నారు అనగానే.. ఓటర్లందరూ మూకుమ్మడిగా కూటమి అభ్యర్థులకు ఓట్లు కుమ్మేసారు..

    ..

    ఈ విషయం జగన్ రెడ్డి కి అర్థం కాక కాదు.. ఈ రోజు ప్రెస్ మీట్ లో జగన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ చూస్తే.. మనకు కూడా అర్థమవుతుంది..

Comments are closed.