దిల్ రాజు షాక్ అవ్వడానికి టైమ్ ఉంది

ఏడాది బ్యాలెన్స్ షీట్ చూడడం అలవాటు చేసుకున్నాం. డిస్ట్రిబ్యూటర్ గా, ప్రొడ్యూసర్ గా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు బ్యాలెన్స్ షీట్ చూస్తాను.

“ఏడాది బ్యాలెన్స్ షీట్ చూడడం అలవాటు చేసుకున్నాం. డిస్ట్రిబ్యూటర్ గా, ప్రొడ్యూసర్ గా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు బ్యాలెన్స్ షీట్ చూస్తాను. ఒక్కొక్క సినిమాను చూస్తూ వెళ్తే నెక్ట్స్ సినిమాకు పని చేయలేం. ఓవరాల్ గా ఎన్ని సినిమాలు చేశాం, లాభమా, నష్టమా అలా చూసుకుంటాం.”

గేమ్ ఛేంజర్ సినిమా రిజల్ట్ గురించి అడిగినప్పుడు దిల్ రాజు చెప్పిన మాటిది. అంటే, గేమ్ ఛేంజర్ షాక్ విలువ ఎంతో తెలియడానికి దిల్ రాజుకు ఇంకా చాలా టైమ్ ఉందన్నమాట. కేవలం లాభం-నష్టం చూసుకోవడానికే కాదు.. ఆనందించడానికి లేదా బాధపడటానికి కూడా బ్యాలెన్స్ షీట్ కావాల్సిందే.

గేమ్ ఛేంజర్ విపరీతమైన నష్టాలు తెచ్చినా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ లాభాలు అందించింది. అయితే అలా వచ్చిన లాభాలు కూడా గేమ్ ఛేంజర్ నష్టాల్ని భర్తీచేయలేకపోయాననేది ఇంటర్నల్ టాక్. ఎందుకంటే, ఈ సినిమాకు పబ్లిసిటీ ఖర్చు కాకుండా 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దిల్ రాజు.

గేమ్ ఛేంజర్ రిజల్ట్ తనకు షాకివ్వలేదని, నిజంగా షాక్ అయితే శనివారం మీ ముందుకు రాలేనంటూ దిల్ రాజు బాగానే కవర్ చేస్తున్నారు కానీ.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తేడా కొట్టి ఉంటే దిల్ రాజు వెర్షన్ మరోలా ఉండేది.

4 Replies to “దిల్ రాజు షాక్ అవ్వడానికి టైమ్ ఉంది”

  1. Yem brathukulu ra swamy ….. Cinimal valla meede brathukutharu…. Malli valli badha padi , nasanam avvali ani korukuntaaru….. Average ga dil raju garu year ki 10 cinimalaku producer ga kani distibuter ga kani vuntaru …. Okka cinema year balance sheet ni decide cheyyadu kada …. Ante mee vuddeaam year lo vache migilina movies kuda flop avva lana …. Producers andharu lose ayyi movies tiyyatam apeste …. Mee atma katha la meeda articles rasukoni brathukutharu?

Comments are closed.