కూతురుతో ఇష్యూ.. కల్పన వాంగ్మూలం

కల్పన నుంచి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు కూకట్ పల్లి పోలీసులు.

నిద్ర మాత్రలు అతిగా తీసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిన గాయని కల్పన హాస్పిటల్ లో కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు ప్రకటించారు వైద్యులు. మరో 2 రోజులు అబ్జర్వేషన్ లో ఉంచి డిశ్చార్జ్ చేస్తామన్నారు

మరోవైపు జరిగిన ఘటనపై కల్పన నుంచి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు కూకట్ పల్లి పోలీసులు. తను ఆత్మహత్య చేసుకోలేదని, కూతురితో చిన్న వాగ్వాదం జరిగిన నేపథ్యంలో నిద్ర పట్టక కాస్త ఎక్కువగా నిద్ర మాత్రలు తీసుకున్నానని తెలిపారు.

ఇదే విషయాన్ని కల్పన కూతురు దయ ప్రసాద్ ప్రభాకర్ కూడా వెల్లడించింది. తమ తల్లి ఆత్మహత్యాయత్నం చేయలేదని, ఆమె డిప్రెషన్ తో బాధపడుతోందని, ఆరోజు రాత్రి కాస్త ఎక్కువ డోస్ లో నిద్రమాత్రలు తీసుకుందని వెల్లడించింది. అయితే తనకు, తల్లితో ఏదో వాగ్వాదం అయిన విషయాన్ని మాత్రం ఆమె మీడియా ముందు బయటపెట్టలేదు.

ఈ విషయాన్ని కల్పన భర్త ప్రసాద్ ఈరోజు బయటపెట్టాడు. పోలీసుల విచారణ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చదువు విషయంలో కల్పనకు, ఆమె కుమార్తెకు మనస్పర్థలు పెరిగాయని.. దాని ఫలితమే ఇదని ప్రసాద్ పోలీసులకు చెప్పాడు.

కల్పన, ఆమె భర్త, కూతురు స్టేట్ మెంట్స్ రికార్డ్ చేసిన పోలీసులు ఒక అభిప్రాయానికొచ్చారు. త్వరలోనే ముగ్గురికీ కౌన్సిలింగ్ ఇప్పించాలని అనుకుంటున్నారు. కల్పన ఔట్ ఆఫ్ డేంజర్ అని తెలియడంతో.. అంతా ఊపిరిపీల్చుకున్నారు.

4 Replies to “కూతురుతో ఇష్యూ.. కల్పన వాంగ్మూలం”

Comments are closed.