మహేష్, రాజమౌళి సినిమా.. అసలేం జరుగుతోంది? దీనిపై ఎవ్వరికీ ఎలాంటి స్పష్టత లేదు. కొంతమంది షూట్ అంటారు, మరికొంతమంది రిహార్సల్స్ అంటారు. ఏదో జరుగుతోంది కానీ బయటకు రావట్లేదు. చివరికి కొబ్బరికాయ కొట్టిన విషయం కూడా చెప్పలేదు.
అయితే ఈసారి మహేష్-రాజమౌళి సినిమాకు లీకులు తప్పకపోవచ్చు. ఎందుకంటే, ఈ సినిమా ఇప్పుడు ఔట్ డౌర్ కు షిఫ్ట్ అయింది. ఔట్ డోర్ లో షూటింగ్ అంటే బయట వ్యక్తుల్ని, వాళ్ల చేతుల్లో ఉన్న సెల్ ఫోన్స్ ను కంట్రోల్ చేయడం కష్టం.
ఈ ప్రభావం ఆల్రెడీ మొదలైంది. తమ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఒరిస్సాలోని కోరాపుట్ కు వెళ్లింది యూనిట్. అక్కడ ల్యాండ్ అవ్వగానే మహేష్ ను క్లిక్ మనిపించారు జనం. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మేటర్ ఇది కాదు. ఈ సినిమాలో పృధ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నాడనే విషయం బయటపడింది. ఆ స్టిల్స్ కూడా లీక్ అయ్యాయి.
ఇక సినిమా సెట్స్ పైకి వెళ్లిన తర్వాత ఇంకెన్ని లీకులొస్తాయో చూడాలి. అన్నట్టు కోరాపుట్ లో ఈ మూవీ కోసం వేస్తున్న సెట్ ప్రాపర్టీస్ ను కూడా కొంతమంది సీక్రెట్ గా వీడియోలు తీసి సోషల్ మీడియాలో వదిలారు.
చూస్తుంటే, ఈసారి లీకుల్ని ఆపడం రాజమౌళి వల్ల కూడా కానట్టుంది. ఈ మూవీకి ఇకపై అన్నీ ఔట్ డోర్ షూటింగ్సే. వైజాగ్, కెన్యా, శ్రీలంక.. ఇలా ఎక్కువ భాగం ఔట్ డోర్ లోనే ప్లాన్ చేశారు.
Oyo
️
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,