ఒకవైపు కుర్రాళ్లు కియరా అద్వానీ మీద మనసు పారేసుకుంటుంటే, తనకు కరీనా కపూర్ అంటే చాలా ఇష్టమని అంటోంది ఆ హీరోయిన్. ఇందులో ద్వంద్వార్థాలు ఏమీ లేవు. కరీనా కపూర్ అంటే తనకు బోలెడంత ఇష్టమని, ఆమె తన గర్ల్ క్రష్ అని అంటోంది కియరా.
ఈ సందర్భంగా తను చిన్నప్పటి నుంచి కరీనా నటించిన నటించిన సినిమాలను ఎంతో ఇష్టంగా చూస్తున్నట్టుగా కియరా సెలవిచ్చింది. కరీనా వివిధ సినిమాల్లో ధరించిన పాత్రలు తనకెంతో ఇష్టమని, వాటిని ఆమె అద్భుతంగా పండించిందని కియరా అద్వానీ ప్రశంసించింది.
అలాంటి పాత్రలు చేయాలని తనకూ ఉందని పేర్కొంది. ఉన్నఫలంగా ఈ హీరోయిన్ ఆ సీనియర్ ను ఎందుకలా పొగుడుతోంది అంటే అందుకో కారణం ఉంది. అదేమిటంటే.. వీళ్లిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించారు. అది విడుదలకు సిద్ధం అవుతూ ఉంది. ఆ సందర్భంలో కియారా అద్వానీ కరీనా మీద తన ప్రేమను చాటుతూ ఉంది.
'గుడ్ న్యూస్' పేరుతో రూపొందిన సినిమాలో కరీనా కపూర్, కియరా అద్వానీలు ముఖ్యపాత్రల్లో నటించారు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా కరీనాను ఆకాశానికి ఎత్తేస్తోంది కియారా. అంతకు మించి ఈ పొగడ్తలకు మరే కారణాలూ లేకపోవచ్చు!