దుల్క‌ర్ స‌ల్మాన్ త‌ప‌న‌ను ప‌ట్టించుకోని తెలుగు వాళ్లు!

మ‌హాన‌టి ఫేమ్ దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించిన 'క‌నులు క‌నుల‌ను దోచాయంటే' సినిమాను తెలుగు వాళ్లు అంత‌గా ప‌ట్టించుకున్న దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. శుక్ర‌వారం ఈ త్రిభాషా సినిమా విడుద‌ల అయ్యంది. ప్ర‌ధానంగా త‌మిళ…

మ‌హాన‌టి ఫేమ్ దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టించిన 'క‌నులు క‌నుల‌ను దోచాయంటే' సినిమాను తెలుగు వాళ్లు అంత‌గా ప‌ట్టించుకున్న దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. శుక్ర‌వారం ఈ త్రిభాషా సినిమా విడుద‌ల అయ్యంది. ప్ర‌ధానంగా త‌మిళ సినిమా ఇది. దాంతో పాటు తెలుగు, మ‌ల‌యాళ భాష‌ల్లో కూడా విడుద‌ల చేసిన‌ట్టుగా ఉన్నారు. పెళ్లి చూపులు సినిమా హీరోయిన్ ఈ సినిమాలో న‌టించింది. అలాగే ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించాడు. 

మ‌హాన‌టి తో దుల్క‌ర్ తెలుగునాట మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. అంత‌కు ముందు సినిమాలు-మ‌మ్ముట్టీ త‌న‌యుడు అనే గుర్తింపు ఉండ‌నే ఉన్నాయి. అయితే అత‌డి తాజా సినిమాకు తెలుగునాట స‌రైన ప‌బ్లిసిటీ లేక‌పోయింది. మ‌ల్టీప్లెక్స్ ఆడియ‌న్స్ ను రీచ్ కావ‌డానికి కూడా స‌రైన ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టుగా లేరు. 

ఈ సినిమా కోసం మ‌రోసారి దుల్క‌ర్  తెలుగులో డ‌బ్బింగ్ కూడా చెప్పుకున్నాడు. ఇలా త‌న‌వంతు ప్ర‌య‌త్నాన్ని ఆ హీరో చేశాడు. అయితే స‌రైన బ‌జ్ వ‌చ్చిన‌ట్టుగా లేదు. ఇక త‌మిళ మూవీ రివ్యూయ‌ర్లు ఈ సినిమా ప‌ట్ల మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్తం చేశారు. కొంద‌రు 2 స్థాయి రేటింగులు ఇవ్వ‌గా, మ‌రి కొంద‌రు ఐదుకు మూడు పాయింట్లు ఇచ్చారు. ఈ సినిమా అబ్స‌ర్డ్ గా, వియ‌ర్డ్ గా ఉందంటూ వ్యాఖ్యానించారు.

క్రైమ్ జరగక ముందే ఆపడానికి వచ్చే టీం