కొంచెం ఇబ్బందిగానే అనిపించింది – రానా

రానా నాయుడు వెబ్ సిరీస్ హిందీ డబ్బింగ్ చెప్పినపుడు ఏమీ అనిపించలేదు కానీ తెలుగు డబ్బింగ్ టైమ్ లో కాస్త ఇబ్బందిగానే ఫీలయ్యామని హీరో రానా వెల్లడించారు.  Advertisement రానా నాయుడు వెబ్ సిరీస్…

రానా నాయుడు వెబ్ సిరీస్ హిందీ డబ్బింగ్ చెప్పినపుడు ఏమీ అనిపించలేదు కానీ తెలుగు డబ్బింగ్ టైమ్ లో కాస్త ఇబ్బందిగానే ఫీలయ్యామని హీరో రానా వెల్లడించారు. 

రానా నాయుడు వెబ్ సిరీస్ విడుదల సందర్భంగా ఆయన ‘గ్రేట్ ఆంధ్ర’తో మాట్లాడుతూ అసభ్యకరమైన పదాలు తెలుగులో, ఎక్కడైనా వినిపించేవే..పల్లెల్లో, పట్టణాల్లో విడివిడిగా ఎవరికి వారు మాట్లాడేవే. కానీ సినిమాలకు, వెబ్ సిరీస్ లకు వచ్చేసరికి ఇన్నాళ్లు అవి దూరంగా వుంటూ వస్తున్నాయి. అందుకే మా వెబ్ సిరీస్ ను విడివిడిగా చూడమని చెబుతున్నాం అంటూ వివరించారు.

ఎంటర్ టైన్ మెంట్ రంగం చకచకా మారుతోందని, మార్పులు అందిపుచ్చుకోవడం, వాటికి అలవాటుపడడం మరింతగా జరగాల్సి వుందన్నారు. మనకు ఇప్పటి వరకు ఇంతంత లెంగ్త్ వున్న కథలు చెప్పడం అలవాటు లేదని, ఇకపై అలవాటు చేసుకోవాల్సి వుంటుందని అన్నారు. ఓటిటి కోసం మనవాళ్లు చేసిన తెలుగు వెబ్ సిరీస్ లు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వల్ల, పడికట్టు లెక్కల వల్ల క్వాలిటీ విషయంలో ఫెయిల్ కావడం అన్నదానితో అంగీకరించాల్సిందే అన్నారు

కానీ విదేశాల్లో మాదిరిగా ఓటిటి సిరీస్ లకు మన దగ్గర కూడా విపరీతమైన ఆదరణ వచ్చే రోజులు ముందు ముందు వున్నాయన్నారు. అవకాశాలను సరైన టైమ్ లో బాహుబలి, కేజిఎఫ్, రోబో వంటి సినిమాల ద్వారా అందిపుచ్చుకున్నామని, ఇది ఇంకా పెరుగుతుందని అన్నారు. 

వెబ్ సిరీస్ లో కంటెంట్ ఎలాంటిది అయినా, కాన్ ఫ్లిక్ట్…అది కూడా తండ్రీ కొడుకుల మధ్య అన్నది కచ్చితంగా సేలబుల్ పాయింట్ అన్నారు. రానా నాయుడు లో ఇలాంటి పాయింట్ ను బలంగా చిత్రీకరించారన్నారు.

ముంబాయి తాను పదేళ్ల క్రితం వెళ్లానని అప్పటికి ఇంకా మనల్ని మద్రాసీలు, చెన్నయ్ వాసులు అనే అనుకునేవారని అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. పాన్ ఇండియా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసినా, మనం ముంబాయి తరలిపోనక్కరలేదని, మన దగ్గర అన్ని భాషలు తెలిసిన వాళ్లు పని చేయడం అన్నది మనకి అడ్వాంటేజ్ అని వివరించారు.