కొండలు…కొండలు..కొండలు

తెల్లారి లేస్తే ఏదో ఒక వంకన విశాఖ రుషి కొండ గురించి రాయడం అన్నది తెలుగుదేశం అను’కుల’ సామాజిక మీడియా నిరంతర కర్తవ్యం అయిపోయింది. కానీ అవసరం అయితే కొండలు కొట్టకుండానే పనులు జరిగాయా…

తెల్లారి లేస్తే ఏదో ఒక వంకన విశాఖ రుషి కొండ గురించి రాయడం అన్నది తెలుగుదేశం అను’కుల’ సామాజిక మీడియా నిరంతర కర్తవ్యం అయిపోయింది. కానీ అవసరం అయితే కొండలు కొట్టకుండానే పనులు జరిగాయా అన్నది మాత్రం వీళ్లు పట్టించుకోరు. జగన్ ప్రభుత్వం విశాఖ లో సిఎమ్ క్యాంప్ ఆఫీసు కోసం రుషికొండ చుట్టూ కొంత భాగం తవ్వింది. అక్కడ భవంతులు కడుతోంది. దాని వల్ల రుషికొండ గ్రీనరీ కొంత పోయింది. ఇది వాస్తవం.

సరే, మరి ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అదే రుషి కొండకు సమీపంలోని ఓ కొండను దగ్గుబాటి రామానాయుడు కు ధారదత్తం చేసారు. కొండ కొంత మేరకు అయినా కొట్టకుండానే స్టూడియో కట్టారా? అప్పుడు కొండ కొట్టేస్తున్నారని వార్తలు రాయలేదేం? బంజారా హిల్స్…జూబ్లీ హిల్స్ కొండలు కావా? అవి ఇప్పుడు ఎక్కడ వున్నాయి. కొండలు కరిగించే కదా..అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, దగ్గుబాటి రామానాయుడు స్టూడియోలు కట్టింది. వాళ్లకి ప్రభుత్వమే కదా కొండలు కేటాయించింది.

సినిమా ప్రముఖులు, మీడియా మెగళ్లు పలువురు కొండలు కొనుక్కుని, కొండల మీద ఇళ్లు కట్టుకున్నారు. మరి వీళ్లు ఇళ్లు కట్టుకున్నపుడు కొండలు కొంతయినా తవ్వకుండానే పని జరిగిందా? రింగ్ రోడ్ నా ప్లాన్ నే. సైబరాబాద్ నా ప్లాన్ నే అని చంద్రబాబు చెప్పుకుంటారు. మరి వాటిలో ఎన్ని కొండలు మాయం అయ్యాయి.

సరే, ఈ రుషి కొండ..రుషి కొండ అని గొంతు చించుకునే మీడియా, కూకట్ పల్లి-హైటెక్ సిటీ రోడ్ లో మూడు నాలుగు కొండలు జస్ట్ మూడు నాలుగేళ్ల క్రితం వుండేవి. ఇప్పుడు ఏమయ్యాయో గమనించిందా? కేసీఆర్ ప్రభుత్వం వాటిని ఎవరెవరికి కేటాయించిందో చూసారా? జస్ట్ ఏడాది కాలంలో రాత్రింబవళ్లు వాటిని పేల్చి, ఆ రాళ్లు అన్నీ తరలించిన సంగతి గమనించారా?

విశాఖ జిల్లాలో అనేక కొండలు వుండేవి. ఇదే మీడియా సామాజిక వర్గ జనాలు దశాబ్దాల క్రితం అక్కడకు వలసపోయి, వాటిని పిండి చేసి క్వారీలు పెట్టుకుని కోట్లు గడించినపుడు ఏం వార్తలు రాసారు..పచ్చదనం పోతోంది అని రాయాల్సింది కదా అప్పట్లో?

అంటే పచ్చదనం…అందం అన్నది రుషికొండకు మాత్రమే పరిమితమా? సరే అదే అనుకుందాం. మరి అదే రుషికొండ కొంత భాగం తవ్వేసి కదా చంద్రబాబు హయాంలో టూరిజం శాఖ రిసార్ట్ ల్లాంటి గెస్ట్ హవుస్ లు కట్టింది. మరి అప్పుడేం చేసారు. రుషికొండ తవ్వకుండానే ఆ టూరిజం శాఖ రిసార్ట్ కట్టారా? అప్పుడు బాబు తవ్వితే ప్రగతి. ఇప్పుడు జగన్ తవ్వితే తప్పు.

‘మనం’ కొండలు గుట్టులు ఆక్రమించేసి రియల్ ఎస్టేట్ చేసేసుకోవచ్చు. ప్రభుత్వం సిఎమ్ కోసం ఓ గెస్ట్ హవుస్ కట్టకూడదు. అంతేకదా.