గీతా 2 సంస్థ నిర్మిస్తోన్న సినిమా కోటబొమ్మాళి పిఎస్. మలయాళంలో బాగా పేరు తెచ్చుకున్న నయాట్టు సినిమాకు ఫ్రీమేక్ ఇది. ఒక పాట బాగా వైరల్ కావడం ద్వారా కోటబొమ్మాళి పిఎస్ సినిమా పేరు బాగా జనాల్లోకి వెళ్లింది.
ఈ సినిమాకు విడుదల డేట్ ను ఫిక్స్ చేసారు. నవంబర్ 24న విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ఇప్పటి వరకు ఆ డేట్ ఒకే ఒక సినిమా వుంది. కళ్యాణ్ రామ్-అభిషేక్ నామా కాంబినేషన్ డెవిల్ . కానీ అది వస్తుందా ఓ వారం అటు ఇటు వెళ్తుందా అన్న అనుమానాలు వున్నాయి.
అందుకే గీతా సంస్థ ఓ అడుగు ముందుకు వేసి కోటబొమ్ళాళి పిఎస్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తోంది. సీనియర్ హీరో శ్రీకాంత్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ ముగ్గురూ మూడు లీడ్ రోల్స్ లో చేస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ ది స్పెషల్ రోల్. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న ఈ సినిమాకు తేజ మార్ని దర్శకుడు. శ్రీకాకుళం జానపద గీతానికి బీట్ యాడ్ చేసి వదిలారు. అది వైరల్ అయింది. మలయాళ మ్యూజిక్ డైరక్టర్ మిధున్ ముకుందన్ ఈ సినిమాతో తొలిసారి తెలుగుకు పరిచయడం అవుతున్నారు.
ఓటిటిలో చాలా మంది చూసేసిన సినిమానే అయినా, బి సి సెంటర్లకు ఇంకా దూరంగానే వుంది మాతృక అయిన మలయాళ సినిమా. అందుకే ఈ సినిమాను ఆ సెంటర్లను టార్గెట్ చేసి రెడీ చేస్తున్నారు.