టాలీవుడ్ లో చిత్రమైన వ్యవహారాలు నడుస్తున్నాయి. అందరూ బంధువులే. అందరూ ఒకే సామాజిక వర్గమే. అంతా యువతరమే.
కానీ గిల్డ్ పుణ్యమా అని రెండుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. రాత్రి పూట జరిగే ఏదో ఒక పార్టీలో ఒకటి రెండు పెగ్గులు లోపలికి వెళ్లగానే లేని పోని వాదనలు తలెత్తుతున్నాయి.
నిన్నటికి నిన్న ఓ పే…ద్ద సంస్థ నిర్మాణ భాగస్వామి సోదరుడి బర్త్ డే పార్టీ అయింది. నిజానికి ఆయన అమెరికాలో వుంటారు. బర్త్ డే అని ఇక్కడకు వచ్చారు.
ఈ పార్టీలో కూడా మళ్లీ గిల్డ్, నిర్మాణాల బంద్ విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. అది కాస్తా వాదనకు తరువాత గట్టిగా సవాళ్లు, ప్రతి సవాళ్లకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఒక నిర్మాత బీర్ బాటిల్ విసరగా, తిరిగి మరో నిర్మాత ఇంకో బాటిల్ విసిరారట. ఈ బాటిల్ వెళ్లి అక్కడే వున్న మూడో నిర్మాత మీద పడి షర్ట్ అంతా ఖరాబు అయిందట.
ఒక నిర్మాత బీర్ బాటిల్ విసరగా, తిరిగి మరో నిర్మాత ఇంకో బాటిల్ విసిరారట. ఈ బాటిల్ వెళ్లి అక్కడే వున్న మూడో నిర్మాత మీద పడి షర్ట్ అంతా ఖరాబు అయిందట.
మొత్తానికి గిల్డ్ వ్యవహారాలు యంగ్, బిగ్ ప్రొడ్యూసర్ల మధ్య వివాదాలకు దారి తీస్తున్నాయి అన్నది వాస్తవం.