హిందుపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఒరిజినల్ కాదని అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప తెలిపారు.
వీడియోను చూస్తున్న విజువల్స్ ను వీడియో చేసి పోస్ట్ చేశారన్నారు. ఈ వీడియో ఒరిజినల్ కాకపోవడంతో నిర్ధారించలేకపోతున్నామన్నారు. ఎడిటింగ్ తో, మార్ఫింగ్ చేశారనే అనుమానాలున్నాయని ఎస్పీ తెలిపారు. ఒరిజినల్ వీడియో దొరికే వరకు దీనిపై నిర్ధారణకు రాలేమన్నారు.
వీడియో మొదట ఐ టీడీపీ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసిన వీడియోను ఎడిటింగ్ చేసి ఫార్వాడ్ చేశారన్నారు. ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫొరెన్సిక్ ల్యాబ్ కు పంపగలం అని మీడియా సమావేశంలో చెప్పారు.
మాధవ్ పై ప్రత్యర్థుల కుట్ర భగ్నమైంది. వైఎస్సార్సీపీని, ఆ పార్టీ నేతను బద్నాం చేయాలనే ప్రయత్నం బెడిసి కొట్టింది. దీనిపై టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో మరి.