తెలుగు రాష్ట్రాలల్లో సంచలనం సృష్టించిన హిందుపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో నిజమా కాదా అనేది ఈ రోజు తెలియనుంది. అనంతపురం జిల్లా పోలీసులు మీడియా సాక్షిగా నిజనిజాలు బయటపెట్టనున్నారు.
ఇప్పటి వరకు ఫోరెన్సిక్ రిపొర్డ్ లో ఏముందననే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రిపోర్ట్ లో ఏముందనే దానిపై అధికార, ప్రతిప్రక్ష రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా అతృతతో ఎదురు చూస్తున్నారు.
గోరంట్ల మాధవ్ వైపు నుండి మాత్రం టీడీపీలో కొంత మంది నాయకులు మార్పింగ్ చేశారని, తనపై ఒక వర్గం కుట్ర చేసిందని ఆరోపించారు. మరో వైపు టీడీపీ నుండి వీడియో నిజం అని అందులో గోరంట్ల మాధవ్ నే ఉన్నారని అతనిపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఫోరెన్సిక్ రిపోర్టులో వీడియో నిజమని తెలితే గోరంట్లపై చర్యలు తీసుకుంటామని వైసీపీ ఇప్పటికే ప్రకటించింది. ఒకవేళ నిజమని తెలితే మాత్రం గోరంట్ల రాజకీయ భవిష్యత్తు ఇబ్బందులో పడుతుంది. మరోవైపు మార్పింగ్ వీడియో అని తెలితే మాత్రం.. కుట్రలో భాగం అయిన వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు.