క్రిష్ మళ్లీ మరోసారి అదే….!

దర్శకుడు క్రిష్ కెరీర్ ఎటు వెళ్తోందో… ఆయన కెరీర్ లో చేసిన అతి పెద్ద తప్పు ఏదైనా వుంటే అది…పవన్ కళ్యాణ్ తో హరి హర వీర మల్లు సినిమా టేకప్ చేయడమే కావచ్చు.…

దర్శకుడు క్రిష్ కెరీర్ ఎటు వెళ్తోందో… ఆయన కెరీర్ లో చేసిన అతి పెద్ద తప్పు ఏదైనా వుంటే అది…పవన్ కళ్యాణ్ తో హరి హర వీర మల్లు సినిమా టేకప్ చేయడమే కావచ్చు. అలాంటి మంచి సబ్జెక్ట్ ను మరో యంగ్ టాప్ హీరోతో అయినా టేకప్ చేసి వుంటే ఈపాటి పూర్తయి వుండేది. విడద‌లై వుండేది.

క్రిష్ కు వున్న టాలెంట్ మేరకు సినిమా కచ్చితంగా జనాల్ని అలరించి వుండేది. కానీ పవన్ చేతిలో ఆ సబ్జెక్ట్ పడింది. ఎటూ చెందకుండా మిగిలింది. పాటలు కోసేసి, ఫైట్లు తీసేసి ఏదో సామెత చెప్పినట్లు.. అయ్యవారిని చేయబోతే కోతి బొమ్మ తయారైనట్లు వెళ్లింది ప్రాసెస్ అంతా. ఇప్పుడు ఆఖరికి ఆ ప్రాజెక్ట్ నుంచే క్రిష్ తప్పుకోవాల్సి వచ్చింది.

అదే హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నపుడు క్రిష్ అనుకుని లేదా అనుకోకుండా చేసిన పని మరోటి వుంది. అదే కొండపొలం సినిమా నిర్మించడం. మంచి సబ్జెక్ట్ అని అనుకున్నారు తప్ప జనం ఆదరిస్తారా? అన్నది ఆలోచించలేదు. దాంతో ఆర్థికంగా నష్టపోయారు. పైగా హరిహర సినిమా విషయంలో అది కూడా ఓ కారణంగా మారిపోయింది.

క్రిష్ కు వున్న టాలెంట్ కు, పేరుకు మంచి సినిమా చేస్తే ఎంత అద్భుతంగా వుంటుంది? కానీ ఎందుకో ఆ దిశగా ఆలోచించడం లేదు. ఇప్పుడు మళ్లీ మరో మెగా హీరోతో సినిమా ప్రొడక్షన్ ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అసలే మార్కెట్ బాగాలేదు. వరుణ్ తేజ్ హీరో, మేర్లపాక దర్శకుడు కాంబినేషన్.

కానీ ఈ డబ్బులు, ఈ కష్టం తో క్రిష్ నేరుగా మంచి సినిమా చేస్తే వేరుగా వుంటుంది. గతంలో వరుణ్ తేజ్ తోనే ఓ సినిమా చేసి దారుణంగా దెబ్బతిన్నారు క్రిష్. అందువల్ల ఓ వేదం, ఓ కంచె ఇలా మాంచి కమర్షియల్ గా వర్కవుట్ అయ్యే సబ్జెక్ట్ తీసుకుని సినిమా చేస్తే బెటర్ కదా? అన్నది అభిమానుల సూచన.