‘కృష్ణ వ్రింద విహారి’ బెస్ట్ మూవీ

యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు…

యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఉషా మూల్పూరి ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ఈ కథను నాగశౌర్య ముందు విన్నారు. కథ చాలా బావుంది. పాండమిక్ లోనే స్టార్ట్ చేశాం. ‘కృష్ణ వ్రింద విహారి' కమర్షియల్ ఎంటర్ టైమెంట్ ఫ్యామిలీ మూవీ. ఈ కథకి ఒక తల్లిగా కనెక్ట్ అయ్యాను. అలాగే పిల్లల ప్రేమ, మా పెద్దబ్బాయి సాఫ్ట్ వేర్ వైపు వుండడం, ఇలా అన్ని ఎలిమెంట్స్ కి కనెక్ట్ అయ్యాం.అంటే సుందరానికి సినిమాకు, మా సినిమాకు పోలిక లేదండీ. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. దర్శకుడు అనీష్ ఆ సినిమా చూశారు. దానికి దీనికి ఎక్కడ పోలిక లేదు.

ఒక పల్లెటూరి కుర్రాడిగా, బ్రాహ్మిన్ కుర్రాడిగా, సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా, కొడుకుగా, ప్రేమికుడిగా, భర్తగా, స్నేహితుడిగా ఇలా భిన్నమైన కోణాల్లో శౌర్యని చూస్తారు. శౌర్య కెరీర్ లో ‘కృష్ణ వ్రింద విహారి' ఒక బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నాను. మొదట అనుకున్న విడుదల తేది పాండమిక్ కారణంగా అన్నీ సినిమాల్లానే ముందువెనుక అయ్యింది. అయితే మంచి సినిమా.. మంచి డేట్ చూసి రావాలని భావించాం. మంచి డేట్ కోసం ఎదురుచూశాం. సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం.బ్రాహ్మిన్ పాత్ర కోసం రెండు నెలలు ట్రైనింగ్ తీసుకున్నారు. ఇందుకోసం దర్శకుడు ఒక ట్రైనర్ ని ఏర్పాటు చేశారు. డబ్బింగ్ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నారు.

200 మంది డ్యాన్సర్స్ తో చేసిన ఏముందిరా పాట కు చాలా  మంచి స్పందన వచ్చింది. దర్శకుడు ఆ సందర్భానికి అలాంటి గ్రాండ్ సాంగ్ వుంటే బావుంటుందని అనుకున్నారు. మంచి మ్యూజిక్ వచ్చింది. అలాగే లిరిక్స్ కూడా అద్భుతంగా కుదిరాయి. విజయ్ మాస్టర్ చక్కని కొరియోగ్రఫీ చేశారు. డీవోపీ సాయిశ్రీరామ్ కూడా చాలా అందంగా ఆ పాటని చిత్రీకరీంచారు. నిజం చెప్పాలంటే కమర్షియల్ మూవీ కంటే దీనికి ఎక్కువ బడ్జెట్ అయ్యింది.

వాస్తవంగా చెప్పాలంటే ఇండస్ట్రీకి ఒక లక్ష్యంతో రాలేదు. అనుకోకుండా రావాల్సివచ్చింది. ఎప్పటికప్పుడు సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళిపోదామా అనే ఆలోచనలోనే వున్నాను కాబట్టి వేరే వారిని అప్రోచ్ అవ్వలేదు. ఈ సినిమా జరిగేటప్పుడు కూడా ఇదే చివరి సినిమా అనుకునే వున్నాను. కానీ మా స్నేహితులు, శ్రేయోభిలాషులు ఇంకా సినిమాలు చేయాలని కోరారు. అందుకే నిర్ణయం మార్చుకొని వేరే హీరోలతో కూడా సినిమా చేయాలని భావిస్తున్నాను. ఇది నా చివరి చిత్రం కాదు

టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత వుంది. షిర్లీ సెటియా ఆ కొరతని తీరుస్తుందనే నమ్మకం వుంది. చాలా మంచి నటి. అద్భుతంగా ఫెర్ఫార్మ్ చేసింది. ఇందులో హీరోయిన్ పేరు వ్రిందా. హీరో పేరు కృష్ణ. అందుకే చిత్రానికి కృష్ణ వ్రిందా విహారి అనే టైటిల్ పెట్టాం.