కృష్ణంరాజు కు అస్వస్థత?

సీనియర్ హీరో, నిర్మాత కృష్ణం రాజు ఆసుపత్రిలో వున్నారు. గత వారం రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని వినిపిస్తోంది. వయోభారం వల్ల వచ్చిన సమస్యలే తప్ప వేరు కాదని విశ్వసనీయ వర్గాల బోగట్టా.  Advertisement…

సీనియర్ హీరో, నిర్మాత కృష్ణం రాజు ఆసుపత్రిలో వున్నారు. గత వారం రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని వినిపిస్తోంది. వయోభారం వల్ల వచ్చిన సమస్యలే తప్ప వేరు కాదని విశ్వసనీయ వర్గాల బోగట్టా. 

నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఈ ఆసుపత్రిని హీరో ప్రభాస్ సందర్శించని వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆరాలు మొదలయ్యాయి.

కృష్ణంరాజు చిరకాలంగా ఇంటికే పరిమితం అయ్యారు. రాధేశ్వామ్ సినిమాలో ఓ కీలకపాత్రను ధరించారు. ఇది కేవలం ప్రభాస్ తన పెదనాన్న మీద అభిమానంతో ప్రత్యకంగా తీసుకున్న నిర్ణయం. కోవిడ్ టైమ్ లో కూడా కృష్ణం రాజు ఒకటి రెండు సార్లు అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయి, నాలుగైదు రోజుల పాటు చికిత్స తీసుకున్నారు.

ప్రభాస్, ఆయన మిత్ర బృందం అనుక్షణం కృష్ణం రాజును కనిపెట్టుకుని వున్నారని తెలుస్తోంది. ఏ విషయమూ అధికారికంగా తెలియదు కానీ ఒకటి రెండు రోజుల్లో కృష్ణం రాజు డిశ్ఛార్జి కావచ్చని బోగట్టా.