గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది

కస్టడీ.. గతేడాది వేసవిలో వచ్చిందీ సినిమా. మళ్లీ ఈ ఏడాది వేసవి వరకు తెరపై కనిపించలేకపోయింది హీరోయిన్ కృతి శెట్టి. వరుస ఫ్లాపులతో ఆమెకు అవకాశాలు తగ్గాయా? లేక కృతి కావాలనే గ్యాప్ తీసుకుందా?…

కస్టడీ.. గతేడాది వేసవిలో వచ్చిందీ సినిమా. మళ్లీ ఈ ఏడాది వేసవి వరకు తెరపై కనిపించలేకపోయింది హీరోయిన్ కృతి శెట్టి. వరుస ఫ్లాపులతో ఆమెకు అవకాశాలు తగ్గాయా? లేక కృతి కావాలనే గ్యాప్ తీసుకుందా? దీనికి ఆమె దగ్గర సమాధానం ఉంది.

“గ్యాప్ ఎందుకు ఇచ్చారని చాలామంది అడుగుతున్నారు. నేను గ్యాప్ ఇవ్వలేదు, అదే వచ్చింది. తమిళ్, మలయాళంలో ఎక్కువగా వర్క్ చేస్తున్నాను. కాబట్టి సహజంగానే తెలుగులో గ్యాప్ వచ్చింది. ప్లాన్ చేసి తీసుకున్నది కాదు.”

ప్రస్తుతం ఆమె మలయాళంలో ఒక సినిమా, తమిళ్ లో 3 సినిమాలు చేస్తోంది. అయినా ఎన్ని సినిమాలు చేశామనేది ముఖ్యం కాదంటోంది. ఎన్ని మంచి పాత్రలు చేశామనేది తనకు ఇంపార్టెంట్ అంటోంది.

“ఇకపై గ్యాప్ ఇవ్వను, ఈ ఏడాది 5 తెలుగు సినిమాలు చేస్తున్నాను. ఏదో ఎక్కువ సినిమాలు చేస్తున్నానని చెప్పడం లేదు. మనస్ఫూర్తిగా, మంచి పాత్రతో ఒక్క సినిమా చేసినా చాలు. నంబర్ అనేది కొలమానం కాదు. తక్కువ సినిమాలు చేస్తున్నాననే ఫీలింగ్ నాకు లేదు. ఏ పాత్రలు చేస్తున్నాననే విషయం మాత్రమే చూస్తాను.”

శర్వానంద్ సరసన మనమే సినిమాలో నటించింది కృతి శెట్టి. తెలుగులో ఆమె కొత్త సినిమాల ప్రకటనలు అధికారికంగా ఇంకా బయటకురాలేదు.