హీరోయిన్ కృతి శెట్టిలో ఎవ్వరికీ తెలియని టాలెంట్ ఏంటి? ఆమె తొలి జీతం ఎంత? కృతి శెట్టికి కాబోయే వాడిలో ఎలాంటి అర్హతలుండాలి? ఇలా గూగుల్ లో కృతి శెట్టిపై ఎన్నో ప్రశ్నలు కనిపిస్తుంటాయి. అలాంటి కొన్ని ప్రశ్నలకు స్వయంగా కృతి శెట్టి సమాధానమిచ్చింది.
కృతి శెట్టి చక్కగా పాటలు పాడుతుందంట. అయితే తన గాత్రం ప్రస్తుతానికి బాత్రూమ్ కే పరిమితమైందని, తను పాడితే ఇంట్లో అమ్మా-నాన్నకు నచ్చడం లేదని చెప్పుకొచ్చింది.
ఇక శాలరీ విషయానికొస్తే, చాలా చిన్న వయసు నుంచే యాడ్స్ చేయడం వల్ల తొలి పారితోషికం ఎంతనేది గుర్తు లేదంటోంది కృతిషెట్టి. ఏదో బిస్కెట్ యాడ్ లో నటించినప్పుడు వంద రూపాయలు ఇచ్చినట్టు గుర్తుందని చెప్పుకొచ్చింది.
కెరీర్ లో డాన్స్ బేస్డ్ మూవీ ఒకటి, యాక్షన్ మూవీ ఒకటి చేయాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది. రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని, నటిగా మారదామని అనుకున్న తర్వాత రంగస్థలం సినిమా చూశానని, అప్పట్నుంచి రామ్ చరణ్ కు ఫ్యాన్ అయిపోయానని చెబుతోంది.
ఇష్టమైన వంటకాల విషయానికొస్తే, తనకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం అంట. అది వెజ్ లేదా నాన్-వెజ్ ఏదైనా ఓకే అంటోంది. ఈకాలం అమ్మాయిలంతా ఫాలో అవుతున్న టాటూ కల్చర్ ను కృతి శెట్టి ఫాలో అవ్వడం లేదు. తన ఒంటిపై ఎలాంటి పచ్చబొట్లు లేవని ఆమె స్పష్టం చేసింది.
అబ్బాయిల విషయానికొస్తే.. నిజాయితీగా ఉండే అబ్బాయిలంటే తనకు ఇష్టమంటోంది. దీంతో పాటు మనిషి పొడుగ్గా చూడ్డానికి బాగుండాలని అంటోంది.