తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా పెద్ద సినిమాల్లో నటించడం ద్వారా గుర్తింపు సంపాదించుకున్న నటి కృతి కర్బందా. తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించిన ఈమె ఇప్పుడు తన డేటింగ్ విషయాన్ని ధ్రువీకరించింది. ఆ విషయం రూమర్ కాదని, తన డేటింగ్ నిజమే అని కృతి అంటోంది.
మోడల్, నటుడు పుల్కిత్ సామ్రాట్ తో కృతి డేటింగ్ చేస్తోందట. ఈ విషయాన్ని ఆమె తన తాజా ఇంటర్వ్యూలో వివరించింది. ఇందులో దాచేది ఏమీ లేదని ఆమె చెబుతోంది.
ఈ విషయాన్ని తను ముందుగా తన తల్లిదండ్రులకే తెలియజేయాలని అనుకున్నట్టుగా ఈ నటీమణి వివరించింది. రహస్యంగా ఉంచాలని తను అనుకోవడం లేదని అంటోంది. ఇక ఈమె ప్రియుడు పుల్కిత్ కు కూడా గతంలో ఇలాంటి వ్యవహారాల అనుభవం ఉన్నట్టుంది. ఒక పెళ్లి కూడా అయినట్టుంది అతడికి. ఏడాదికే భార్యకు విడాకులు ఇచ్చి సింగిల్ అయ్యాడు, ఇప్పుడు కృతితో డేటింగ్ వార్తల్లోకి వచ్చాడతను.
–