ఇటీవలే జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించిన నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్, తన చిన్నతనంలో జరిగిన లైంగిక వేధింపుల గురించి సంచలన విషయాలను బయపెట్టింది. ఓ ఇంటర్వ్యూలో ఖుష్బూ మాట్లాడుతూ.. 8 ఏళ్ల వయసులో తన తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలిపింది.
చిన్న తనంలో లైంగిక దాడి జరిగినప్పుడు ఆ బాధ వారిని జీవితాంతం వెంటాడుతుంది. అది వారి జీవితంలో ఓ మచ్చగా మిగులుతుందని.. తన భార్య, పిల్లలను కొట్టడం, తన ఏకైక కుమార్తెను లైంగికంగా వేధించడం తన జన్మహక్కుగా భావించే తండ్రిని 15 ఏళ్లు వచ్చిన తర్వాత ఎదిరించటం మొదలు పెట్టానని.. 16 ఏళ్ల వయసులో తమ కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడని.. ఆ టైంలో మా కుటుంబం ఎన్నో సమస్యలు ఎదుర్కోన్నాం అంటూ అవేదన వ్యక్తం చేశారు.
2010లో డీఎంకేలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఖుష్బూ సుందర్… అనంతరం, 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీకీ 2020లో రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తక్కువ టైంలోనే ఖుష్బూనీ బీజేపీ పార్టీ గుర్తించి జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా మోదీ ప్రభుత్వం నియమించింది.