సీత కోసం సముద్రం దాటితే సరిపోదంట..!

కొన్ని సినిమాలు టీజర్ తోనే ఎట్రాక్ట్ చేస్తాయి. అలాంటిదే రావణాసుర సినిమా. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. అందులో రవితేజ యాక్షన్ కూడా చూపించారు. అయితే ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఇందులో రవితేజ…

కొన్ని సినిమాలు టీజర్ తోనే ఎట్రాక్ట్ చేస్తాయి. అలాంటిదే రావణాసుర సినిమా. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. అందులో రవితేజ యాక్షన్ కూడా చూపించారు. అయితే ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఇందులో రవితేజ నెగెటివ్ రోల్ లో కనిపిస్తున్నాడా లేక డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తున్నాడా? అసలు రవితేజ ఇందులో ఎన్ని పాత్రలు పోషిస్తున్నాడు..?

ఇలా ఒకటి కాదు, ఎన్నో ప్రశ్నలు రేకెత్తించేలా రావణాసుర టీజర్ కట్ చేశారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది రావణాసుర సినిమా. ఈ సినిమా టీజర్ లో ఓ అమ్మాయిని క్రిమినల్ వెంబడిస్తాడు. అతడి చేతిలో ఆమె హత్యకు గురవుతుంది. ఇలా ఒకటి కాదు, 2-3 జరుగుతాయి. ఈ కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేసేందుకు జయరాం రంగంలోకి దిగుతాడు. ఆ వెంటనే రవితేజను ఇంట్రడ్యూస్ చేస్తారు.

ఇలా ఆసక్తికరంగా సాగింది రావణాసుర టీజర్. నిమిషం నిడివి కలిగిన ఈ టీజర్ చూస్తే, ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అనే విషయం అర్థమౌతోంది. తన కెరీర్ లో రవితేజ చేస్తున్న ఫుల్ లెంగ్త్ క్రైమ్ థ్రిల్లర్ ఇదే. సినిమాలో సుశాంత్ పాత్ర కూడా ఆసక్తికరంగా ఉండబోతోందనే విషయం టీజర్ చూస్తే తెలుస్తుంది.

ఇవన్నీ ఒకెత్తు, చివర్లో రవితేజ చెప్పిన డైలాగ్ మరో ఎత్తు. “సీతను తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు, ఈ రావణాసురుడ్ని కూడా దాటాలి.” అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ ఉత్సుకత రేకెత్తిస్తోంది. సినిమా మెయిన్ పాయింట్ ఈ డైలాగ్ లోనే ఉన్నట్టు అనిపిస్తోంది.

అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 7న రిలీజ్ చేయబోతున్నారు.