ప్రముఖ లైవ్ హోస్ట్ యాంకర్ శివాని సేన్ మృతి చెందారు. 'ఎపిలెప్టిక్ ఎటాక్' అనే బ్రెయిన్ సంబంధిత సమస్యతో ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. ఆమె మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
2005లో తొలిసారిగా ఒక ఈవెంట్‌కు హోస్ట్‌గా చేసిన ఆమె.. దేశంలో జరిగిన పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమానికి కూడా ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
కార్పొరేట్ ఈవెంట్స్, కాన్ఫరెన్స్‌లు, గవర్నమెంట్ ఈవెంట్స్, మీడియా లాంచ్‌లు, కోటీశ్వరుల కుటుంబాలకు సంబంధించిన వివాహాలు, ఫ్యాషన్ షోలు.. ఇలా ఈవెంట్ ఏదైనా తన యాంకరింగ్‌తో ఆ ఈవెంట్‌కే వన్నె తెచ్చేది శివాని. ఇంత తక్కువ వయసులోనే ఆమె చనిపోవడాన్ని పరిచయస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా శివాని సేన్‌కు పెళ్లై ఒక బాబు కూడా ఉన్నట్లు తెలిస్తోంది.