లేడీ పవర్ స్టార్..సాయి పల్లవి

లేడీ అమితాబ్..లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ లైన్లు గతంలో విజ‌యశాంతికి వుండేవి. ఆ తరువాత ఎందరు హీరోయిన్లు వచ్చినా, ఎంత క్రేజ్ తెచ్చుకున్నా అంత వరకు వెళ్లలేదు. కానీ సాయిపల్లవి వ్యవహారం అలా…

లేడీ అమితాబ్..లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ లైన్లు గతంలో విజ‌యశాంతికి వుండేవి. ఆ తరువాత ఎందరు హీరోయిన్లు వచ్చినా, ఎంత క్రేజ్ తెచ్చుకున్నా అంత వరకు వెళ్లలేదు. కానీ సాయిపల్లవి వ్యవహారం అలా కాదు. 

ఆమె అంటే మాస్ ఆడియన్లు కూడా ఫిదా అయిపోతున్నారు. మొన్నటికి మొన్న శ్యామ్ సింగ రాయ్ ఫంక్షన్ లో అదే తంతు. నిన్నటికి నిన్న ఆడవాళ్లు మీకు జోహార్లు ఫంక్షన్ లోనూ అదే తీరు. సాయి పల్లవి..సాయిపల్లవి..అంటూ ఒకటే గోల. ఎవర్నీ మాట్లాడనివ్వని వైనం.

ఇదంతా చూసి దర్శకుడు సుకుమార్ కు పవర్ స్టార్ అనే అరుపులు గుర్తుకువచ్చాయి. లేడీ పవర్ స్టార్ అని ఆయనే బిరుదు ఇచ్చేసారు. ఆడవాళ్లు ఫంక్షన్ లో ఫ్యాన్ రచ్చ రచ్చ చేసారు. విరామం లేకుండా సాయి పల్లవీ అంటూ అరుపులు. పంక్షన్ ముగిసి ఆమె వెళ్లిపోతుంటే కారు వెనుక పరుగులు. 

హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా సాయి పల్లవి తెచ్చుకున్న క్రేజ్ అది. ఫిదా, మిడిల్ క్లాస్ అబ్బాయి లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్ ఇలా అన్నీ ఆమెకు ఎంతో క్రేజ్ తెచ్చిన సినిమాలే. ఆ సినిమాల హిట్ లు వెనుక ఆమె స్ట్రాంగ్ రీజ‌న్ కూడా. ప్రస్తుతం ఆమె నటించిన విరాటపర్వం విడుదల కావాల్సి వుంది.

కమర్షియల్ గా, గ్లామర్ తో మిగిలిన వారు ఎంత క్రేజ్ తెచ్చుకున్నా, సాయి పల్లవి తెచ్చుకున్న పేరు, క్రేజ్ వేరు. ఇకపై సినిమా ఫంక్షన్ లకు సాయిపల్లవిని గెస్ట్ గా పిలిస్తే చాలు..కావాల్సినంత హడావుడి.

Click Here For Photo Gallery