బ్లాక్ బస్టర్ హిట్ ను క్యాష్ చేసుకోలేకపోతున్నారు

జైలర్.. మామూలు హిట్ కాదిది. కళ్ల ముందే కోట్ల రూపాయలు కురిపించిన సినిమా. తమిళ్ సంగతి పక్కనపెడితే, తెలుగులో రజనీకాంత్ కు మరోసారి స్టార్ డమ్ తెచ్చిన సినిమా. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ…

జైలర్.. మామూలు హిట్ కాదిది. కళ్ల ముందే కోట్ల రూపాయలు కురిపించిన సినిమా. తమిళ్ సంగతి పక్కనపెడితే, తెలుగులో రజనీకాంత్ కు మరోసారి స్టార్ డమ్ తెచ్చిన సినిమా. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వస్తున్న లాల్ సలామ్ సినిమాపై ఎంత హైప్ ఉండాలి..  ఇంకెంత హంగామా జరగాలి..?

అలాంటివేం జరగలేదు. లాల్ సలామ్ సినిమా సైలెంట్ గా రిలీజైంది. తెలుగులో ఎలాంటి ప్రచారం చేయకుండానే ఈ సినిమాను థియేటర్లలో వదిలేశారు. 2 రోజుల కిందట తెలుగు వెర్షన్ ట్రయిలర్ ను మాత్రం విడుదల చేసి చేతులు దులుపుకున్నారు.

దీంతో ఆ ప్రభావం బుకింగ్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. జైలర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో లాల్ సలామ్ కు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు భారీగా దక్కాయి. అయితే ఓపెనింగ్స్ మాత్రం నిల్. ఇంకా చెప్పాలంటే, రజనీకాంత్ సినిమాకు 5 శాతం కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు.

నిజంగా ఇది ఘోరమైన విషయం. జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో, తెలుగు ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడంలో లాల్ సలామ్ యూనిట్ పూర్తిగా ఫెయిలైంది.

నిజానికి ఈ సినిమాలో రజనీది పూర్తి నిడివి రోల్ కాదు. ఆయన కాస్త పెద్దగా ఉండే గెస్ట్ రోల్ చేశారు. అయినప్పటికీ తమిళనాట ఆయన చుట్టూనే ప్రచారం నడిచింది. అదే పని తెలుగులో కూడా చేసుంటే బాగుండేది.