గుంటూరుకారం ఓటీటీలోకి వచ్చేసింది. మహేష్ నటించిన ఈ సినిమా చుట్టూ మరోసారి చర్చ మొదలైంది. అయితే ఈసారి మరింత ఆసక్తికరమైన డిస్కషన్ నడుస్తోంది. అది కూడా పూజా హెగ్డే చుట్టూ తిరగడం విశేషం.
మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో ముందుగా పూజాహెగ్డేను అనుకున్నారు. ఆ తర్వాత ఆమె స్థానంలో శ్రీలీలను తీసుకున్నారు. సరిగ్గా ఇదే అంశంపై స్పందిస్తున్నారు ఓటీటీ ప్రేక్షకులు.
కనీసం పూజాహెగ్డేను కొనసాగించి ఉంటే మూవీలో మంచి రొమాన్స్ పండి ఉండేదని అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం గుంటూరుకారం సినిమాలో పూజాహెగ్డే నటించినట్టయితే, ఆమె కెరీర్ పూర్తిస్థాయిలో క్లోజ్ అయి ఉండేదని అంటున్నారు.
గుంటూరుకారం సినిమాలో హీరోయిన్ పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. దీనికితోడు సినిమాపై ఓ రేంజ్ లో నెగెటివిటీ ఉంది. రెవెన్యూ సంగతి పక్కనపెడితే, కంటెంట్ పరంగా ఇది ఫ్లాప్ సినిమా. ఇలాంటి సినిమాలో పూజాహెగ్డే ఉంటే ఆమెపై ఐరెన్ లెగ్ ముద్ర మరింత బలంగా పడేదని, అప్పుడిక ఆమె పూర్తిగా ఇంటికే పరిమితయ్యేదంటూ కామెంట్స్ పడుతున్నాయి.
అది నిజమే. ఇప్పుడా బాధను శ్రీలీల అనుభవిస్తోంది. మొత్తానికి గుంటూరుకారం ఓటీటీ రిలీజ్ తో పూజాహెగ్డే టాపిక్ మరోసారి తెరపైకొచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో సినిమాలు చేయడం లేదు.