లావణ్య త్రిపాఠీ ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు అయ్యింది. కానీ ఖాతాలో చెప్పుకోదగ్గ మెమరబుల్ సినిమా లేదు. మనం..సోగ్గాడే చిన్ని నాయనా, భలే భలే మగాడివోయ్ ఇలా కొన్ని హిట్ లు అయితే జాబితాలో వున్నాయి కానీ బ్లాక్ బస్టర్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది.
మంచి నటి అని ప్రూవ్ చేసుకుంది కానీ వరుసపెట్టి అవకాశాలు వెల్లు వెత్తలేదు. ఇలా పడుతూ లేస్తూనే పదేళ్ల జర్నీ పూర్తయిపోయింది టాలీవుడ్ లో.
చేతిలో ఇప్పుడు వున్న ఒకే ఒక్క తెలుగు సినిమా హ్యాపీ బర్త్ డే. ఇది హిట్ అనిపించుకుంటే మళ్లీ మరో సినిమా చేతిలోకి వచ్చే అవకాశం వుంటుంది. హీరోయిన్ చుట్టూ తిరిగే కథతో తయారవుతోంది హ్యాపీ బర్త్ డే.
నిజానికి ఈ సినిమా లోకి సమంత ను తీసుకోవాలని ట్రయ్ చేసారని వార్తలు వినిపించాయి. ఏమయితేనేం ఈ పాత్ర లావణ్యను వరించింది. ఆ పాత్రకు ఏ మేరకు న్యాయం చేసింది, ఈ పాత్ర లావణ్యకు ఏ మేరకు ఉపయోగపడుతుంది అన్నది మరో రెండు రోజుల్లో రిజల్ట్ తెలుస్తుంది.
పదేళ్ల జర్నీ సందర్భంగా తొలిసారి లావణ్య తన కోసం మీడియాను కలిసింది. తన జర్నీకి సహకరించిన మీడియాకు థాంక్స్ చెప్పింది. లావణ్య బ్యాచ్ హీరోయిన్లంతా దాదాపు తెరమరుగు అవుతున్నారు. హ్యాపీ బర్త్ డే హిట్ కొడితే లావణ్య మరి కోన్నాళ్లు టాలీవుడ్ లో కనిపిస్తుంది.