విశాఖ నుంచే అగ్నిపధ్ వీరులు

అగ్నిపధ్ పేరిట కేంద్రం ఆర్మిలో చేపడుతున్న రిక్రూట్మెంట్ కి మంచి స్పందన లభిస్తోందని రక్షణ శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో ఎక్కడికక్కడ జిల్లాలలో రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహించేందుకు కూడా ముహూర్తాన్ని ఖరారు చేశారు. …

అగ్నిపధ్ పేరిట కేంద్రం ఆర్మిలో చేపడుతున్న రిక్రూట్మెంట్ కి మంచి స్పందన లభిస్తోందని రక్షణ శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో ఎక్కడికక్కడ జిల్లాలలో రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహించేందుకు కూడా ముహూర్తాన్ని ఖరారు చేశారు. 

ఉత్తరాంధ్రా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు యానం నుంచి వచ్చే అగ్ని పధ్ దరఖాస్తుదారులకు రిక్రూట్ మెంట్లని అగస్ట్ 14 నుంచి అదే నెల 31వ తేదీ వరకూ విశాఖ జిల్లా వేదికగా చేపడుతున్నట్లుగా రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, క్రిష్ణా, పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ‌ కాకినాడ, ఎన్టీయార్ జిల్లాలకు చెందిన అభ్యర్ధులు హాజరు కావచ్చు అని రక్షణ శాఖ పేర్కొంది. 

విశాఖ కేంద్రంగా కొత్తగా స్కీమ్ అగ్నివీరులు మరో నెలలో ఎంపికై ఇక్కడ నుంచే శిక్షణకు వెళ్లనున్నరన్నమాట. 

ఇదిలా ఉంటే గతం కంటే ఎక్కువగా ఈ జిల్లాల నుంచి అగ్నిపధ్ పధకం కోసం దరఖాస్తులు రావడం ఆనందంగా ఉందని రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒక వైపు కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపధ్ స్కీమ్ వివాదాస్పదమైన నేపధ్యంలో పెద్ద ఎత్తున దరఖాస్తులు చేరడం భారీగా పెరిగిన నిరుద్యోగ ప్రభావమే అంటున్నారు.