ఆ దర్శకుడు ఇంటర్వెల్ కే క్లైమాక్స్ చూపించాడట

ప్రతి సీన్ క్లయిమాక్స్ లా ఉంటుందని చెప్పడం సినీజనాలకు అలవాటు. తమ సినిమాకు హైప్ తెచ్చేందుకు ఇలా చెబుతుంటారు. కానీ చంద్రముఖి-2లో మాత్రం ఇది నిజంగానే జరిగిందంటున్నాడు హీరో లారెన్స్. చంద్రముఖి-2లో ఇంటర్వెల్ టైమ్…

ప్రతి సీన్ క్లయిమాక్స్ లా ఉంటుందని చెప్పడం సినీజనాలకు అలవాటు. తమ సినిమాకు హైప్ తెచ్చేందుకు ఇలా చెబుతుంటారు. కానీ చంద్రముఖి-2లో మాత్రం ఇది నిజంగానే జరిగిందంటున్నాడు హీరో లారెన్స్. చంద్రముఖి-2లో ఇంటర్వెల్ టైమ్ కే దర్శకుడు క్లైమాక్స్ చూపించారని అంటున్నాడు.

“చంద్రముఖి-1 లో క్లయిమాక్స్ లోనే భయం వేస్తుంది. చంద్రముఖి-2కి వచ్చేసరికి, దర్శకుడు వాసు ఇంటర్వెల్ బ్లాక్ కే ఆ ఫీల్ తీసుకొచ్చేశారు. క్లయిమాక్స్ లో చూపించాల్సింది ఇంటర్వెల్ లో చూపించారు. మరి సెకండాఫ్ ఎలా నడపాలి? దీన్ని డైరక్టర్ చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. క్లయిమాక్స్ లో ఓ బ్రిలియంట్ ట్విస్ట్ ఇచ్చారు.”

ఇలా ఇంటర్వెల్ కే క్లైమాక్స్ చూపించిన విషయాన్ని బయటపెట్టాడు లారెన్స్. ఒకవేళ చంద్రముఖి-3 తీస్తే, అందులో రజనీకాంత్-లారెన్స్ ఇద్దరూ కలిసి నటించొచ్చని రీసెంట్ గా దర్శకుడు పి.వాసు ప్రకటించారు. చూస్తుంటే.. క్లయిమాక్స్ లో అలాంటి ట్విస్ట్ ఏదో ఇచ్చినట్టున్నారు.

చంద్రముఖి-2లో హారర్ ఎలిమెంట్స్ ఎంత బాగుంటాయో, కామెడీ కూడా అంతే బాగుంటుందని అంటున్నారు లారెన్స్. చంద్రముఖిలో వడివేలు కామెడీ ఏ రేంజ్ లో క్లిక్ అయిందో, దానికి ఏమాత్రం తగ్గకుండా పార్ట్-2లో వడివేలు, మనోబాల కామెడీ చేశారని చెప్పుకొచ్చాడు లారెన్స్. 28న థియేటర్లలోకి వస్తోంది చంద్రముఖి-2.