లెజెండ్స్ నటించడం అదృష్టం

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమాలు 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలలో శ్రుతి హాసన్ కథానాయికగా…

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమాలు 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలలో శ్రుతి హాసన్ కథానాయికగా నటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య' చిత్రాల విశేషాలని పంచుకున్నారు శ్రుతి హాసన్.

నిజానికి ఇది నేను ఊహించలేదు. నా కెరీర్ లో ఇలా జరగడం రెండోసారి. ఏడేళ్ళ క్రితం నేను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయ్యాయి. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి ఒక సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు, బాలకృష్ణ , చిరంజీవి లాంటి ఇద్దరు లెజెండరీ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి. చాలా ఆనందంగా వుంది. ఈ విషయంలో చాలా అదృష్టంగా ఫీలౌతున్నా.

రెండు భిన్నమైన కథలు. భిన్నమైన పాత్రలు. వీరసింహా రెడ్డిలో నా పాత్ర ఫన్ ఫుల్ గా వుంటుంది. వాల్తేరు వీరయ్యలో కంప్లీట్ డిఫరెంట్. రెండు పాత్రలు సవాల్ తో కూడుకున్నవి. వాల్తేరు వీరయ్యలో నా పాత్రని దర్శకుడు బాబీ చాలా చక్కగా డిజైన్ చేశారు. ఈ విషయంలో ఆయనకి థాంక్స్ చెప్పాలి. వీరసింహారెడ్డి విషయానికి వస్తే నా పాత్రలో కామెడీ వుంటుంది. కామెడీ చేయడం చాలా కష్టం. అందుకే ఏ పాత్రకు ఆ పాత్రే ప్రత్యేకం.

వాల్తేరు వీరయ్యలో నాకు ఫైట్ కూడా వుంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ చాలా మంచి కాన్సెప్ట్ తో వచ్చారు. నాకు యాక్షన్ అంటే చాలా ఇష్టం. ఆ ఫైట్ గురించి ఇప్పుడే చెప్పేస్తే ప్రేక్షకులకు థ్రిల్ పోతుంది. చిరంజీవి, బాలకృష్ణ గారు చాలా మంచి డ్యాన్సర్లు.. వారితో డ్యాన్స్ చేయడం కష్టం అనిపించిందా ? చిరంజీవి, బాలకృష్ణ గారితో డ్యాన్స్ చేయడం నైస్ ఎక్స్ పీరియన్స్. వారిద్దరూ చాలా మంచి డ్యాన్సర్లు. సుందరి పాట చాలా వైడ్ గా రీచ్ అయ్యింది. శ్రీదేవి చిరంజీవి పాట కూడా అద్భుతంగా వచ్చింది.

వాల్తేరు వీరయ్య వైజాగ్ వేడుకలో నేను కనిపించలేదు కారణం మరేం కాదు..కొంచెం అనారోగ్యం చేసింది. ఇంకా పూర్తిగా రికవర్ కాలేదు. వైజాగ్ అంటే నాకు ఇష్టం. ఆ ఈవెంట్ ని చాలా మిస్ అయ్యా. ఈ సినిమాల తరువాత ప్రభాస్ తో సినిమా చేస్తున్నా అంటూ ముగించారు శృతిహాసన్.