3 రోజుల్లో 7 ఖండాలు చుట్టేశారు!

గట్టిగా ఒక రోజు ప్రయాణం చేస్తేనే చాలామంది అలిసిపోతారు. మరుసటి రోజు రెస్ట్ తీసుకుంటారు. అలాంటిది ఈ ఇద్దరు మాత్రం ఏకథాటిగా ఈ ప్రపంచాన్నే చుట్టేశారు. ఇంకా చెప్పాలంటే.. 3 రోజుల్లో 7 ఖండాల్ని…

గట్టిగా ఒక రోజు ప్రయాణం చేస్తేనే చాలామంది అలిసిపోతారు. మరుసటి రోజు రెస్ట్ తీసుకుంటారు. అలాంటిది ఈ ఇద్దరు మాత్రం ఏకథాటిగా ఈ ప్రపంచాన్నే చుట్టేశారు. ఇంకా చెప్పాలంటే.. 3 రోజుల్లో 7 ఖండాల్ని కవర్ చేసి గిన్నిస్ బుక్ ఎక్కారు ఈ ఇద్దరు.

భారత్ కు చెందిన డాక్టర్ అలీ ఇరానీ, సుజోయ్ కుమార్ మిత్రా ఈ ఘనత సాధించారు. జస్ట్ 73 గంటల్లో ఖండాలన్నీ చుట్టేశారు. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా ఖండాల్లో వీళ్లు ప్రయాణించారు.

డిసెంబర్ 4న అంటార్కిటికాలో వీళ్లు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 7న ఆస్ట్రేలియాలోని మెల్ బోర్డ్ లో ల్యాండ్ అయి తమ ప్రయాణాన్ని ముగించారు. అలా 3 రోజుల 1 గంట 5 నిమిషాల 4 సెకెన్ల పాటు నిర్విరామంగా ప్రయాణించి ఖండాలన్నీ చుట్టేశారు.

వీళ్ల ఫీట్ ను గిన్నిస్ బుక్ గుర్తించింది. తాజాగా వాళ్లకు సర్టిఫికేట్ కూడా అందించింది. అత్యంత వేగంగా 7 ఖండాల్ని చుట్టివచ్చిన వ్యక్తులుగా వీళ్లిద్దరూ గుర్తింపు పొందారు.

అయితే తమ రికార్డ్ ఎక్కువ రోజులు నిలవదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు వీళ్లిద్దరూ. ఎవరో ఒకరు తమ రికార్డ్ ను బద్దలుకొట్టే అవకాశం ఉందని, అందుకే తామే మరికొన్ని రోజుల్లో తమ రికార్డును బ్రేక్ చేస్తామని చెబుతున్నారు.