లియో స్ట్రీమింగ్… ఈసారి మరింత కొత్తగా!

ఓవైపు మిక్స్ డ్ టాక్ నడుస్తున్నప్పటికీ, మరోవైపు థియేటర్లలో బంపర్ కలెక్షన్లు కొల్లగొడుతోంది లియో సినిమా. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా జోరు తగ్గినప్పటికీ.. తమిళనాట మాత్రం ఇప్పటికీ ఈ సినిమాదే హవా. అటు…

ఓవైపు మిక్స్ డ్ టాక్ నడుస్తున్నప్పటికీ, మరోవైపు థియేటర్లలో బంపర్ కలెక్షన్లు కొల్లగొడుతోంది లియో సినిమా. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా జోరు తగ్గినప్పటికీ.. తమిళనాట మాత్రం ఇప్పటికీ ఈ సినిమాదే హవా. అటు ఓవర్సీస్ లో కూడా లియోకు ఎదురులేకుండా పోయింది.
 
విజయ్, లోకేష్ కనగరాజ్ ఫ్యాన్స్ ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కోసం ఎంతలా ఎదురుచూశారో.. ఇప్పుడీ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ థియేటర్లలో సినిమాను ఓసారి చూసినప్పటికీ, ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వీళ్లంతా ఎదురుచూడ్డానికి ఓ కారణం ఉంది.

త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది లియో సినిమా. కాకపోతే థియేట్రికల్ వెర్షన్ కంటే కాస్త భిన్నంగా ఓటీటీ వెర్షన్ ఉండబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు లోకేష్ బయటపెట్టాడు.

సినిమాలో లియో ఎలా ఎలివేట్ అవుతాడనేది అందరికీ తెలిసిందే. సంజయ్ దత్ తో వచ్చే సన్నివేశాలు అందరికీ గుర్తే. ఇప్పుడీ వెర్షన్ ను ఓటీటీలో కొత్తగా ఆవిష్కరించబోతున్నట్టు ప్రకటించాడు డైరక్టర్. మరీ ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో 18-20 నిమిషాలు, థియేట్రికల్ వెర్షన్ తో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.

దీంతో పాటు.. విజయ్ అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని మరికొన్ని ఎలివేషన్ సన్నివేశాల్ని కూడా యాడ్ చేసినట్టు లోకేష్ చెప్పాడు. ఓటీటీ వెర్షన్ కు రన్ టైమ్ సమస్య లేదు కాబట్టి, ఫ్యాన్స్ కు ఈ కొత్త వెర్షన్ కూడా నచ్చుతుందని భావిస్తున్నాడు. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ దక్కించుకుంది. నవంబర్ 21న తెలుగు-తమిళ-హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.