మాంచి కాంపిటీషన్లో వస్తోంది విజయ్-లోకేష్ కనకరాజ్ లియో సినిమా. ఈ సినిమా మీద మంచి అంచనాలు వున్నాయి. కానీ సినిమా వస్తున్న డేట్‌కు రెండు బలమైన తెలుగు సినిమాలు వున్నాయి.
రవితేజ-టైగర్ నాగేశ్వరరావు, బాలయ్య-అనిల్ రావిపూడి ల భగవంత్ కేసరి. ఇలాంటి టైమ్‌లో వస్తున్న ఆ సినిమాకు తెలుగు వెర్షన్ హక్కుల రేటు ఆకాశంలో వుంది. 21 కోట్లకు పైగానే తెలుగు వెర్షన్ కోసం డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో మన బయ్యర్లు అమ్మో అంత రేటా అంటున్నారు. అటు చూడడం లేదు. ఇలాంటి టైమ్ లో ఇక్కడ ఇంకో మతలబు కూడా వుంది. మాస్టర్ కు సంబంధించి పాత లావాదేవీలు ఏవో దిల్ రాజు అండ్ కో తో వున్నాయి. ఏడు కోట్ల వరకు సెటిల్ మెంట్ చేయాల్సి వుంది. అది పూర్తయితే తప్ప ఈ సినిమాను తెలుగునాట విడుదల అన్నది కష్టం. అందువల్ల ఇంత రేటు చెబుతున్నారా? లేక నిజంగానే విజయ్ సినిమా తెలుగు నాట అంత చేస్తుందని అనుకుంటున్నారో?
రెండు పెద్ద తెలుగు సినిమాల మధ్య అంత రేటుతో ఎవరూ కొనరు. అందువల్ల ఇక నేరుగా పంపిణీ చేసుకోవడమో, లేదా దిల్ రాజు అండ్ కో కే పాత సెటిల్ మెంట్ ల లెక్కలు తేల్చి ఏదో రేటుకు ఇవ్వడమో చేయాల్సి వుంటుంది.