'',,,ఎన్నికల్లో ఎంత డబ్బులు పంచినా ఓటరు మాత్రం ఆత్మసాక్షికే ఓటేస్తారు. ప్రజలకు ఎవరికి ఓటేయాలో అర్థమైంది…'' నటుడు, పార్ట్ టైమ్ పొలిటీషియన్ శివాజీ
అమరావతి రైతులకు మద్దతు నటుడు శివాజీ మద్దతు తెలపడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆయన ఎటు వైపు వుంటున్నారన్నది చిరకాలంగా జనాలకు తెలిసిందే.
అయితే ఈ రోజు ఆయనో మంచి మాట అన్నారు. ఎన్నికల్లో ఎంత డబ్బులు పంచినా ఓటర్లు ఆత్మసాక్షికే ఓటేస్తారు. ప్రలోభాలకు లొంగరు. ప్రజలకు ఎవరికి ఓటేయాలో అర్థమైంది అంటూ మాట్లాడారు.
నిజమే కదా, కుప్పంలో ఎంత ప్రలోభం ఎవరు పెట్టినా, అక్కడి ఓటర్లు ఆత్మసాక్షితోనే ఓటేసారు. అక్కడే కాదు, తొంభైశాతం స్థానిక ఉపఎన్నికల్లో ఫలితాలు వైకాపాకు అనుకూలంగా వచ్చాయంటే జనం ప్రలోభాలకు లొంగలేదు. ఆత్మసాక్షిగా ఓటు వేసారు. అంతే కదా శివాజీ చెప్పింది
మరి ఈ పాటి దానికి రౌడీయిజం చేసారు ఇంకోటి..ఇంకోటి అంటారేంటీ తెలుగుదేశం జనాలు. శివాజీకి తెలిసిన పాటి తెలియదా? అంతెందుకు లెక్కలు అబద్దాలుచెప్పవు. ఓటింగ్ పర్సంటేజ్ లు ఎలా వున్నాయో అధికారికంగా ప్రకటించారు జగన్.
వైకాపా, తేదేపా, జనసేన లెక్కలు క్లియర్ గా వున్నాయి. అంతా ఆత్మ ప్రబోధానుసారం జరిగిన ఓటింగ్ నే కదా?