ముందు గర్భం.. తర్వాతే పెళ్లి

ఈమధ్య ఇలియానా తను తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది. దీంతో 'తండ్రి ఎవరు?' అంటూ ఆమెపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచింది. అయితే ఇలా పెళ్లి కాకుండా, తల్లిగా మారిన హీరోయిన్ ఇలియానా ఒక్కరే…

ఈమధ్య ఇలియానా తను తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది. దీంతో 'తండ్రి ఎవరు?' అంటూ ఆమెపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచింది. అయితే ఇలా పెళ్లి కాకుండా, తల్లిగా మారిన హీరోయిన్ ఇలియానా ఒక్కరే కాదు. ఈ జాబితా చాలా పెద్దది.

ఈమధ్య అలియాభట్ కూడా బాంబ్ పేల్చింది. పెళ్లయిన కొన్ని రోజులకే తను గర్భందాల్చినట్టు ప్రకటించి, ఆ తర్వాత బిడ్డకు జన్మనిచ్చింది అలియా భట్. అయితే పెళ్లికి ముందే తను గర్భందాల్చిన విషయాన్ని ఆమె బయటపెట్టింది. ప్రస్తుతం రణబీర్-అలియా స్టార్ కపుల్ గా కొనసాగుతున్నారు.

నటి నేహా ధూపియా వ్యవహారం కూడా ఇలాంటిదే. ఆమె కూడా పెళ్లికి ముందే గర్భందాల్చింది. దీంతో ఇరు కుటుంబ సభ్యులు హుటాహుటిన నేహాధూపియా, అంగద్ బేడీకి పెళ్లి చేశారు. 2018 మే నెలలో వీళ్ల పెళ్లి జరిగితే, ఆ ఏడాది నవంబర్ కే బిడ్డకు జన్మనిచ్చింది నేహా ధూపియా. దీన్ని బట్టి మేటర్ అర్థం చేసుకోవచ్చు.

ఈ లిస్ట్ లో దియా మీర్జా, కల్కి కొచ్లిన్ కూడా ఉన్నారు. 2021లో పెళ్లికి ముందే గర్భందాల్చింది దియా మీర్జా. కల్కి కొచ్లిన్ కూడా పెళ్లికి ముందే 2020లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత వీళ్లు పెళ్లిళ్లు చేసుకున్నారు.

ఫారిన్ బ్యూటీ ఎమీ జాక్సన్ కూడా తన ప్రెగ్నెన్సీని పెళ్లికి ముందే ప్రకటించింది. బిడ్డ పుట్టిన తర్వాత ఆర్భాటంగా పెళ్లి చేసుకుంది. సో.. ఇలియానా కూడా ఇదే పద్ధతి ఫాలో అయినట్టు కనిపిస్తోంది. త్వరలోనే ఆమె తన బాయ్ ఫ్రెండ్ పేరును బయటపెడుతుందా లేక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటుందా అనేది తేలాల్సి ఉంది.