రామ్ చరణ్ సినిమా.. రోజుకో రూమర్

ఇది గేమ్ ఛేంజర్ మేటర్ కాదు. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే కొత్త సినిమా సంగతి. ఈ మూవీకి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ నడుస్తోంది. అంతలోనే సినిమాపై రోజుకో పుకారు షికారు చేస్తోంది. Advertisement…

ఇది గేమ్ ఛేంజర్ మేటర్ కాదు. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే కొత్త సినిమా సంగతి. ఈ మూవీకి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ నడుస్తోంది. అంతలోనే సినిమాపై రోజుకో పుకారు షికారు చేస్తోంది.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందనేది వాస్తవం. ఆ పాత్ర కోసం కాస్త క్రేజ్ ఉన్న నటుడ్ని వెదుకుతున్నారనేది కూడా నిజం. అయితే అంతలోనే కొంతమంది పేర్లు తెరపైకి రావడం, వీళ్లు ఫిక్స్ అంటూ కథనాలు రావడం మొదలయ్యాయి.

చరణ్-బుచ్చిబాబు సినిమాలో కీలక పాత్ర కోసం ముందుగా విజయ్ సేతుపతి పేరు తెరపైకి వచ్చింది. అంతలోనే శివరాజ్ కుమార్ పేరు వినిపించింది. ఇప్పుడీ రెండు పేర్లు స్థానంలో కొత్తగా జాన్ అబ్రహాం పేరు వినిపిస్తోంది.

అటు హీరోయిన్ల విషయంలో కూడా ఇదే స్పెక్యులేషన్. జాన్వికపూర్ ను దాదాపు ఫిక్స్ చేశారంటూ న్యూస్. అంతలోనే ఆమె స్థానంలో సమంతను తీసుకున్నారని, ఈ సినిమాతోనే సమంత రీఎంట్రీ ఇస్తుందని మరో వార్త. ఇప్పుడీ ఇద్దర్నీ కాదని దీపిక పదుకోన్ పేరు వినిపిస్తోంది.

ఇలా చరణ్-బుచ్చిబాబు సినిమాపై పూటకో గాసిప్, రోజుకో న్యూస్ చక్కర్లు కొడుతూనే ఉంది. అటు యూనిట్ మాత్రం ఇవేం పట్టించుకోకుండా ప్రీ-ప్రొడక్షన్ లో తలమునకలై ఉంది. ఈ సినిమాకు ఉత్తరాంధ్ర యాస తెలిసిన నటీనటులు కావాలి. అందుకే వాళ్ల కోసం శ్రీకాకుళం, విజయనగరం తదితర ప్రాంతాల్లో కాస్టింగ్ కాల్ చేస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. మరోవైపు రెహ్మాన్ ఈ సినిమా ట్యూన్స్ పై వర్క్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఇవే అధికారికం.