Advertisement

Advertisement


Home > Movies - Movie News

లవ్ మీ మీద ‘ఫ్యామిలీ’ ఎఫెక్ట్

లవ్ మీ మీద ‘ఫ్యామిలీ’ ఎఫెక్ట్

లవ్ మీ.. ఆశిష్- వైష్ణవి కాంబినేషన్‌లో దిల్ రాజు నిర్మిస్తున్న రొమాంటిక్ హర్రర్ సినిమా. ఈ సినిమా విడుదల ఏప్రిల్ మూడో వారంలో ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడు మే నెలలోకి వాయిదా వేస్తున్నారు. మే మూడో వారంలో వుండే అవకాశం వుంది.

ఈ సినిమా కు టాప్ టెక్నీషియన్లు పిసి శ్రీరామ్, కీరవాణి తదితరులు పని చేసారు. మనిషి కోరి వెళ్లి, దెయ్యానికి ప్రేమ రుచి చూపిస్తే అనే కాన్సెప్ట్ ఏదో వుంది ఈ సినిమా కథ వెనుక. ఈ సినిమా పక్కాగా హిట్ కావాలి. ఆశిష్ హీరోగా ముందుకు సాగాలి అంటే ఇది అవసరం.

అయితే ప్రస్తుతం సినిమాల సీజన్ బాలేదు. మంచి డేట్ అనుకుని ఫ్యామిలీ స్టార్ విడుదల చేస్తే సరైన ఓపెనింగ్ రాలేదు. యావరేజ్ టాక్ కు తీసుకువచ్చినా, జనం థియేటర్ కు రాలేదు. దాంతో ఇప్పుడు నిర్మాత దిల్ రాజు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

ఎన్నికల మూడ్ నడుస్తోంది. ఎండలు మండిపోతున్నాయి. జనాలు అంతా హాలీడే మూడ్ ల్లో ఎటెటో వెళ్తున్నారు. ఇలాంటి టైమ్ లో విడుదల చేయడం కన్నా, ఎన్నికల తరువాత విడుదల చేస్తే బెటర్ అని భావిస్తున్నారు.

అయితే మే రెండో వారం తరువాత ఇప్పటికే ఓ సినిమా డేట్ వేసారు. విష్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విడుదల వుంది. దానికి కాస్త గ్యాప్ ఇచ్చి వేస్తారో, మరి ముందే వేస్తే, మరో ఒకటి రెండు రోజుల్లో డేట్ పోస్టర్ వస్తే తెలుస్తుంది. ఎలాగూ గ్యాప్ దొరికింది కదా అని సినిమాకు చిన్న చిన్న కరెక్షన్స్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?