Advertisement

Advertisement


Home > Movies - Movie News

లవ్ స్టోరీకి రిలీజ్ డేట్ లాక్

లవ్ స్టోరీకి రిలీజ్ డేట్ లాక్

చైతన్య-సాయిపల్లవి జోడీగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో సునీల్ నారంగ్ నిర్మిస్తున్న సినిమా లవ్ స్టోరీ.  ఫిదా తరువాత ప్లాన్ చేసిన ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. పైగా విడుదల కూడా ఆలస్యమైంది.

ఈలోగా సాంగ్ ప్రోమోలు, టీజర్ కట్ లు జనాలను మరింత ఊరిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సినిమా విడుదల డేట్ ఫిక్స్ చేసారు. ఏప్రిల్ 16న విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. నిజానికి ఈ సినిమాకు ఓవర్ సీస్ మార్కెట్ చాలా కీలకం.

ఓవర్ సీస్ హక్కులు ఆరున్నర కోట్లకు విక్రయించేసారు. అందువల్ల అక్కడ మార్కెట్ ఫుల్ గా ఓపెన్ అయ్యేవరకు సినిమా విడుదల వుండదని అందరూ భావించారు. కానీ ఆ విషయం పక్కన పెట్టి డేట్ ఫిక్స్ చేసేసారు. 

ఇదే సంస్థ నిర్మిస్తున్న నాగశౌర్య లక్ష్య సినిమా కూడా అదే నెలలో రెండు వారాల గ్యాప్ లో విడుదలవుతుంది. ఏప్రిల్ 30న ఆ సినిమా వుంటుంది. విశేషం ఏమిటంటే లవ్ స్టోరీ సినిమాకు ముందుగా పవర్ స్టార్ వకీల్ సాబ్ విడుదలవుతోంది. లక్ష్య సినిమా తరువాత మెగాస్టార్ ఆచార్య విడుదలవుతుంది. అన్నింటికన్నా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే నాని టక్ జగదీష్ కూడా అదే రోజు విడుదల అనౌన్సు చేసారు ఇప్పటికే.

నువ్వు ఒడిపోతే పార్టీ మూసివేస్తావా !

దృతరాష్టుడి మాదిరిగా మారిపోతారేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?