టాలీవుడ్ లో మళ్లీ రొటీన్, సింపుల్ టైటిల్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. 'ఫిదా' అంటూ సింపుల్ టైటిల్ తో వచ్చి ఫామ్ లోకి వచ్చిన శేఖర్ కమ్ముల ఈ సారి అలాంటి సింపుల్ టైటిల్ తోనే పలకరిస్తూ ఉన్నాడు. లవ్ స్టోరీ అంటూ వస్తున్నాడు. నాగచైతన్య, సాయి పల్లవిలు జంటగా నటిస్తున్న ఈ సినిమా గురించి ఈ టైటిల్ కొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. చివరకు ఆ టైటిల్ నే ఖరారు చేశారు. సంక్రాంతి సందర్భంగా అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
హీరో,హీరోయిన్లను చూపిస్తూ సింపుల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. టైటిల్ లాగానే ఈ ఫస్ట్ లుక్ కూడా సింపుల్ గానే ఉంది. ప్రేమ తాలూకు గాఢతను ప్రజెంట్ చేసేలా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్ శిష్యగణంలో ఒకడైన పవన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడట. సమ్మర్ స్పెషల్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాను శేఖర్ కమ్ముల తన అమిగోస్ క్రియేషన్స్ పై నిర్మిస్తున్నాడు.