Advertisement

Advertisement


Home > Movies - Movie News

లూసిఫర్ ను ఏం చేస్తున్నారు ‘మెగాస్టార్’

లూసిఫర్ ను ఏం చేస్తున్నారు ‘మెగాస్టార్’

మలయాళంలో సూపర్ హిట్..ఓటిటిలో ఇంకా పెద్ద హిట్..లూసిఫర్ సినిమా. ఇలాంటి సినిమాను టచ్ చేయడమే కాస్త రిస్క్. అందులోనూ మోహన్ లాల్ కు, మెగాస్టార్ కు ఎవరి ప్లస్ లు వారికి వున్నాయి. ఎవరి మైనస్ లు వారికి వున్నాయి. 

గతంలో మెగాస్టార్ చాలా రీమేక్ లు చేసి హిట్ లు కొట్టారు. కానీ అప్పుడు ఓటిటి, ఇంకా ఇతర డిజిటల్ ప్లాట్ ఫారమ్ లు లేవు. అందువల్ల తమిళ,మలయాళ సినిమాలు చూసే అవకాశం లేదు. ఇప్పుడు అలా కాదు. అక్కడ సినిమా చూస్తున్నారు. తెలుగులో రీమేక్ చేస్తే తేడా గమిస్తున్నారు. ముఖ్యంగా అక్కడి నటుల నటన, మన వాళ్ల నటన లెక్కలు కడుతున్నారు.ఇలాంటి టైమ్ లో రీమేక్ లు చేయాలంటే కాస్త రిస్కే.

ఆ రిస్కు చాలదు అన్నట్లు మన వ్యవహారాలు జోడిస్తే ఇక చెప్పనక్కరలేదు. లూసిఫర్ సినిమా మాస్ సినిమా కాదు. పంచ్ డైలాగులు వుండే సినిమా కాదు. మాస్ సినిమా అంతకన్నా కాదు. కానీ ఇలాంటి సినిమాను తీసుకుని మెగాస్టార్ ఓ మాస్, యాక్షన్, పొలిటికల్ పంచ్ డైలాగుల సినిమాగా మార్చేస్తున్నట్లు కనిపిస్తోంది. నిన్నటికి నిన్న ట్రయిలర్ విడుదలయిన దగ్గర నుంచి లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ మీద ట్రోలింగ్ మొదలైంది.

మెగాస్టార్ ప్లస్ లు మెగాస్టార్ కు వండొచ్చు. కానీ మోహన్ లాల్ స్టయిల్ యాక్టింగ్ వేరు. కళ్లతోటి నటించేస్తాడు. నటనలో 70-80ల కాలాల నాటి డ్రామా అన్నది అస్సలు వుండదు. మెగాస్టార్ అలాకాదు. ఆయన సుదీర్ఘ నట యాత్రలో డ్రామా అన్నది మిక్స్ అయిపోయింది. డ్రమెటిక్ గా డైలాగు చెప్పడం, బాడీ లాంగ్వేజ్ అలవాటైపోయింది. ఇది ఈ తరం ఆడియన్స్ కు నప్పేది కాదు. దానికి తోడు పొలిటికల్ డైలాగులు. లూసిఫర్ లో పొలిటికల్ కంటెంట్ కన్నా ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ వుంటుంది.

మెగాస్టార్ దాన్ని కాస్తా యాక్షన్, పొలిటికల్ డ్రామాగా మారుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలా చేస్తే మాస్ జనాలు చప్పట్లు కొడతారు అన్న భావన ఆయనకు వుండి వుండొచ్చు. కానీ అటు నటనలో తేడా వుండి, ఇటు టేకింగ్ లో తేడా వచ్చి, దానికి ఇలాంటి పొలిటికల్ ట్రిక్ లు తోడయితే సినిమాను జనాల ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్నది చూడాలి. 

పోనీ అలాగని ఈ డైలాగులు అన్నీ సినిమా విడుదల వరకు దాస్తున్నారా అంటే అదీ లేదు. అదేదో పోలిటికల్ స్టంట్ అన్నట్లుగా మెగాస్టార్ నే వాటిని రివీల్ చేసుకుంటూ వస్తున్నారు. ఫలితం ఎలా వుంటుందో చూడాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?