లూసిఫర్ స్క్రిప్ట్ రెడీ

మొత్తానికి ఇన్నాళ్లకు మెగాస్టార్ కు నచ్చినట్లు లూసిఫర్ రీమేక్ స్క్రిప్ట్ రెడీ అయింది. ఎన్వీ ప్రసాద్ నిర్మించే ఈ రీమేక్ కు దర్శకత్వం వహించే వి. వి. వినాయక్, ఈ మధ్యనే రెండు రోజులు…

మొత్తానికి ఇన్నాళ్లకు మెగాస్టార్ కు నచ్చినట్లు లూసిఫర్ రీమేక్ స్క్రిప్ట్ రెడీ అయింది. ఎన్వీ ప్రసాద్ నిర్మించే ఈ రీమేక్ కు దర్శకత్వం వహించే వి. వి. వినాయక్, ఈ మధ్యనే రెండు రోజులు బెంగళూరులో మెగాస్టార్ ను కలిసి, ఫుల్ అండ్ ఫైనల్ నెరేషన్ ఇచ్చి వచ్చారు.  మెగాస్టార్ సూచనలు, ఇన్ పుట్స్ కు అనుగుణంగా, లూసిఫర్ ను చాలా వరకు మార్చి తయారుచేసినట్లు తెలుస్తోంది.

ఆచార్య ప్రాజెక్టు తరువాత మెగాస్టార్ చేయబోయే ప్రాజెక్టు ఇదే అని తెలుస్తోంది. మైత్రీ మూవీస్-బాబీ, అలాగే మెహర్ రమేష్ వేదాలం రీమేక్ కన్నా ముందుగా లూసిఫర్ రీమేక్ వుంటుందని తెలుస్తోంది. ఆచార్య సినిమాను అన్నీ కుదిరితే 2021 సమ్మర్ కు రెడీ చేయాలని ఆలోచిస్తున్నారు. అదే జరిగితే, లూసిఫర్ సెట్ మీదకు 2021 సమ్మర్ వేళకు మెగాస్టార్ వచ్చే అవకాశం వుంది.

ఎప్పటి లాగే కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ తో కలిసి ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తారు. సమర్పణ మాత్రమే కొణిదెల బ్యానర్. నిర్మాణం మాత్రం ఎన్వీ ప్రసాద్ నే. ఈ ప్రాజెక్టులో రెండు కీలకపాత్రలు వున్నాయి. ఒకటి విలన్ పాత్ర, రెండోది ముఖ్యమంత్రి కొడుకు పాత్ర. వీటికి ఎవర్ని తీసుకునేది అన్న విషయం వరకు ఇంకా రాలేదు. స్టార్ కాస్ట్ సెలక్షన్ కు ఇంకా చాలా టైమ్ వుంది. ఖైదీ నెం 150 సినిమా తరువాత వివి వినాయక్ మరోసారి మెగాస్టార్ తో కలిసి పనిచేయబోతున్నారు.

చంద్ర‌బాబు@25

ఆ మగాడు వస్తాడా? ఈ మగాడితోనే రాజీకొస్తారా?