Advertisement

Advertisement


Home > Movies - Movie News

డౌట్స్ అక్కర్లేదు.. పవన్ రావట్లేదు

డౌట్స్ అక్కర్లేదు.. పవన్ రావట్లేదు

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఓజీ. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమానే పవన్ తదుపరి చిత్రం. సినిమా షూటింగ్ కూడా మ్యాగ్జిమమ్ పూర్తయింది. పవన్ మరో 20 రోజులు కాల్షీట్లు కేటాయిస్తే చాలు, టోటల్ సినిమా పూర్తయిపోతుంది.

అందుకే ధైర్యంగా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 27న వచ్చేస్తున్నాం అంటూ ప్రకటించారు. పవన్ సినిమాకు ఇలా ముందుగా విడుదల తేదీ ఇవ్వడం అత్యుత్సాహం అవుతుందంటూ అప్పట్లోనే చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడా అనుమానాలే నిజమయ్యాయి.

పవన్ ఓజీ సినిమా దాదాపుగా ఆ తేదీకి రావడం లేదు. ఈ మేరకు ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు ఇప్పటికే సమాచారం అందించారు. అందుకే కొన్ని రోజులుగా ఆ తేదీకి రాబోతున్నట్టు ఇతర ప్రాజెక్టుల నుంచి లీకులు వస్తున్నాయి.

ఇప్పుడా లీకుల్ని నిజం చేస్తూ.. లక్కీ భాస్కర్ సినిమాను ఓజీ డేట్ కు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. లక్కీ భాస్కర్ సినిమా నాగవంశీది. అతడు పవన్ కు ఎంత క్లోజ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి నిర్మాత ఓజీకి పోటీగా తను నిర్మిస్తున్న లక్కీ భాస్కర్ ను విడుదల చేయడు కదా.

తెరవెనక పక్కాగా అంతా సెట్ చేసిన తర్వాతే నాగవంశీ నుంచి ప్రకటన వస్తుంది. లక్కీ భాస్కర్ రిలీజ్ డేట్ కూడా అలానే వచ్చింది. సో.. ఓజీ సినిమా ఆ తేదీకి రానట్టే. పవన్ సెట్స్ పైకి వచ్చిన తర్వాత ఓజీ కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?