మా ఫ్యామిలీ జోలికి రావద్దు-విష్ణు

మా ఎన్నికల హడావుడి వేడెక్కిపోయింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు హోరెత్తుతున్నాయి. మంచు విష్ణు వర్గంపై ప్రకాష్ రాజ్ బలమైన ఆరోపణలు చేసారు. దానికి బదులుగా విష్ణు కూడా బలమైన ఆరోపణలు సంధించారు.  Advertisement తను పోటీలో…

మా ఎన్నికల హడావుడి వేడెక్కిపోయింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు హోరెత్తుతున్నాయి. మంచు విష్ణు వర్గంపై ప్రకాష్ రాజ్ బలమైన ఆరోపణలు చేసారు. దానికి బదులుగా విష్ణు కూడా బలమైన ఆరోపణలు సంధించారు. 

తను పోటీలో వున్నానని, తనపై ఆరోపణలు చేయమని, అంతే తప్ప తన ఫ్యామిలీ జోలికి వస్తే మర్యాద వుండదని ప్రకాష్ రాజ్ ను హెచ్చరించారు. 

ఓట్లు అడగడం తన హక్కు అని, తన తరపున అడగడం తన తండ్రి బాధ్యత అని ఆయన వెల్లడించారు. తాము ఏం చేసినా లీగల్ గానే చేస్తున్నామని, ప్రతీదీ అందరికీ తెలిసేలా చేసాము కానీ దొంగతనంగా కాదని ఆయన అన్నారు.

ప్రకాష్ రాజ్ టాలీవుడ్ ను చీల్చడానికి వచ్చారని ఆరోపించారు. పెద్దలకు సైతం గౌరవం ఇవ్వడం లేదన్నారు. జీవిత కు కూడా విష్ణు గట్టి సమాధానం ఇచ్చారు. రెండు రోజుల క్రితం రాజశేఖర్ తన తండ్రి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడారో జీవితకు తెలియదా అని ప్రశ్నించారు. 

ఇది చివరి సారి అని తన ఫ్యామిలీ జోలికి వచ్చినా, తన ఫ్యామిలీ పేర్లు ప్రస్తావించినా మర్యాదగా వుండదని మంచు విష్ణు హెచ్చరించారు. 

ముఠానాయకుడు ప్రకాష్ రాజ్

ఇప్పటి వరకు మా సంఘానికి ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా, సమస్యలు రాలేదని, కానీ తొలిసారి ఓ ముఠా ఏర్పాటై, దానికి ఓ ముఠా నాయకుడు తయారై, నానా గత్తర చేస్తున్నారని నటుడు నరేష్ అన్నారు. 

ఒక్కసారి తప్ప మిగిలిన అన్ని సార్లు బ్యాలట్ పద్దతే వాడామని. తిప్పి తిప్పి కొడితే 500 ఓట్ల కోసం ఇవిఎమ్ లు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. 

ఫైనాన్సియర్లకు డబ్బులు ఎగ్గొట్టి, నడిగర సంఘంలో నిధులు ఖాళీ చేసి, ఇప్పుడు మా సంఘానికి వచ్చారు ప్రకాష్ రాజ్ అని నరేష్ ఆరోపించారు.