'మా' అసోసియేషన్ అధ్యక్షుడుగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించి ఎడాది కాలం పూర్తయిన సందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) తాజాగా కొన్ని అసోసియేషన్ కే సాద్యం కానీ నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది.
వాటిలో ముఖ్యంగా ఏ సభ్యుడు అయిన 'మా' గురించి సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిన, ప్రెస్ మీట్ పెట్టిన వారికి సభ్యత్వం రద్దు చేస్తాం అన్ని చెప్పడం. ఆసలు 'మా' సభ్యులకు సాద్యం కానిదే ఇది. ఒకప్పుడు అసలు 'మా' అనేది ఒకటి ఉందని కూడా మాములు జనాలకు తెలిసేది కాదు. కానీ వారికి వారే మీడియా ముందుకు వచ్చి ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడంతోనే 'మా' అనేది ఉందని ప్రజలకు తెలిసింది.
బహుశా మా ఎన్నికలు జరిగినట్లు తెలుగు రాష్ట్రాలోని ఉపఎన్నికలు కూడా జరగవు. నీవు ఇంత అవినీతి చేశావు అంటే నీవు ఇంత చేశావు అంటూ రోజు ఒక టీవీ డిబెట్లలో కనిపించే 'మా' సభ్యులు తాజా నిర్ణయంతో మారతారు అని అనుకోవడం అత్యాశనే అవుతుంది. నటులు సినిమాలో కంటే 'మా' ఎన్నికల టైం లో ఎక్కువ వినోదం పంచుతారని అనుకుంటుంటారు సినీ అభిమానులు.
అలాగే 'మా'లో సభ్యత్వ కోసం కూడా కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. బహుశా మా అసోసియేషన్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేక వర్గానికి రుచించడం లేదని తెలుస్తోంది. బహుశా ఈ నిర్ణయాలు 'మా' చీలిక అయ్యే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.