మ్యాడ్ సినిమా వచ్చింది. జస్ట్ స్టూడెంట్ జానర్ ఫన్. ఇప్పుడు మ్యాడ్ 2 వస్తోంది. టూ మ్యాడ్ అనేలా వుంది టీజర్. మ్యాడ్ కు సీక్వెల్ ఏముంటుంది? మ్యాడ్ లో వున్న కీలక క్యారెక్టర్లు అన్నీ మరోసారి కలిస్తే పుట్టే ఫన్. అంతకన్నా సీక్వెల్ కు ఏం కావాలి.
మ్యాడ్ లో కీలకమైన క్యారెక్టర్లు మరోసారి ఓ అకేషన్ లో కలుసుకుంటాయి. కలసి గోవా వెళ్తాయి. అక్కడ వెర్రిమొర్రి వేషాలు వేస్తాయి. అది చాలు కదా మరోసారి ఫన్ పుట్టించడానికి.
గతంలో కమల్ హాసన్ పంచతంత్రం అనే సినిమా వచ్చింది. అయిదుగురు ఫ్రెండ్స్ కలిసి గోవా వెళ్లడం, అక్కడ ఇరుకున పడడం. కమెడియన్ నగేష్ పాత్ర స్పెషల్. ఆ లైన్ కనిపిస్తోంది మ్యాడ్ 2 టీజర్ లో. ఇక్కడ నలుగురు స్నేహితులు.. అక్కడ నగేష్.. ఇక్కడ మురళీధర్ గౌడ్ అనుకోవచ్చు.
ఫన్ విషయానికి వస్తే రెండు మూడు పంచ్ లు సరిగ్గా పేలాయి. స్వీట్ పెట్టి పేరు చెప్పు.. భాయ్ అంటే బాయ్ అనడం…చిన్న నాన్న..పెద్ద నాన్న… లాంటి పంచ్ లు థియేటర్ లో నవ్వులు పూయిస్తాయి. యూత్ టచ్ లేదా అడల్ట్ టచ్ కాస్త వున్నట్లే కనిపిస్తోంది. మార్చి నెలాఖరులో వస్తున్న ఈ సినిమాలో ఈ వన్ లైనర్ ఫన్ లు ఏమాత్రం క్లిక్ అయినా ఓ రేంజ్ లో ఆడేసే అవకాశం వుంది.