హీరోలు మాయ‌మై…!

క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు నీళ్లు త‌క్కువ తాగు. క‌న్నీళ్లు కొంచెమైనా త‌గ్గుతాయి.

నిజం మాట్లాడ‌డం ఒక సాధ‌న‌. అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తూ వుండు. నీ క‌ళ్ల‌లోకి చూస్తూ కూడా అబ‌ద్ధ‌మే మాట్లాడ‌గ‌లిగితే నువ్వు అస‌లుసిస‌లైన మార్కెటింగ్ సీఈవో. నిన్ను చూసి అద్దం కూడా సిగ్గుప‌డితే రాజ‌కీయాల్లో చేరు. ప్ర‌జ‌ల‌కి నువ్వు చాలా అవ‌స‌రం. క‌ల‌ల్ని అమ్మే వాళ్ల కోసం వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. డ్రీమ్ మ‌ర్చంట్స్ దివాళా తీయ‌రు.

జీవితం ఒక సినిమా అయితే. స్క్రిప్ట్ దేవుడిది. యాక్టింగ్ నీది. నీ కథ‌లో కూడా హీరోవి కాలేవు. నాయ‌కుడు అనేది క‌ల్పిత ప‌దం. ప్ర‌తినాయ‌కుడే శిలాశాస‌నం. హీరోలు మాయ‌మై చాలా కాల‌మైంది. విల‌న్లే త‌మ‌ని తాము హీరోలనుకుంటున్నారు. ఆ విష‌యం వాళ్ల‌కు ఎవ‌రూ చెప్ప‌రు. చెప్పినా న‌మ్మ‌రు.

బ‌త‌క‌డం ఎవ‌రూ నేర్పే ప‌నిలేదు. ప్ర‌కృతే నేర్పిస్తుంది. తిండికోసం ఎంత దూరం ఎగిరినా ప‌క్షి త‌న చెట్టుని, గూడుని మ‌రిచిపోదు. దానికి గూగుల్ మ్యాప్ వుండ‌దు. వేల కూన‌ల్లో కూడా త‌న బిడ్డ‌ని గుర్తు ప‌ట్ట‌గ‌ల‌దు. మెమ‌రీ ప‌వ‌ర్ ఎక్క‌డా నేర్చుకోదు. జ్ఞాప‌క‌మే జీవితం.

స‌త్యం జ‌యిస్తుంది నిజ‌మే కానీ, ఆఖ‌రి రీల్‌లో, అంప‌శ‌య్య మీద. కోమాలో వున్న‌వాడికి డాక్ట‌ర్ గెలిస్తే ప్ర‌యోజ‌నం కానీ, ధ‌ర్మం గెలిస్తే ఏం ఉప‌యోగం? అయినా వైద్యం, ధ‌ర్మం ఇపుడు వేర్వేరు విష‌యాలు. వైద్యం, ధ‌నం పాలునీళ్ల‌లా క‌లిసిపోయాయి.

న‌క్క‌లు, తోడేళ్ల‌కి అడ‌వుల్లో జీవ‌నం క‌ష్ట‌మై న‌గ‌రాల‌కి వ‌ల‌స‌లు వ‌చ్చాయి. హ్యూమ‌న్ రీసోర్సస్ నిండా అవే. మాన‌వ వ‌న‌రుల్ని బాగా అర్థం చేసుకుంటున్నాయి.

త‌మ‌కి ద‌క్క‌ద‌ని తెలిసినా తేనెటీగ‌లు తేనె పెడుతూనే వుంటాయి. ఇత‌రుల శ్ర‌మ‌ని దోచుకోవ‌డం మ‌నిషి మొద‌ట తేనెప‌ట్టు నుంచే నేర్చుకున్నాడు.

అడవిలో ప‌క్షులు పాడుతున్నాయ‌ని సంతోష‌ప‌డ‌కు. క్రూర‌మృగాలు వ‌స్తున్న‌పుడు అవి పాట ద్వారానే హెచ్చ‌రిస్తాయి.

వెన్నెల అందంగా వుంటుంది. అన్నీ స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి. వేట‌గాడి చూపు కూడా ప‌దునుగా వుంటుంది. జాగ్ర‌త్త‌.

స‌ముద్రంలో క‌లిసేట‌ప్పుడు న‌ది గ‌జ‌గ‌జా వ‌ణుకుతుంది. అనంత‌మైన కొత్త ప్ర‌పంచాన్ని స్వీక‌రించ‌డం, అంగీక‌రించ‌డం చాలా క‌ష్టం. పంజ‌రాల‌కి అల‌వాటుప‌డిన వాళ్లు రెక్క‌లున్నాయ‌నే విష‌యం మ‌రిచిపోతారు. బుద్ధుడు రాజ్యాన్ని వ‌దిలేసిన‌ట్టు , కంఫ‌ర్ట్ జోన్ నుంచి బ‌య‌టికి వ‌స్తే నువ్వే ఒక కొత్త ఆవిష్క‌ర‌ణ‌.

కంచిలో చీర‌లే కాదు, క‌థ‌లు కూడా కావాల్సిన‌న్ని వుంటాయి. దుకాణ‌దారులే మాస్ట‌ర్ స్టోరీ టెల్ల‌ర్స్‌.

చీమ‌లు త‌మ ఆత్మ‌క‌థ రాసుకుంటే త‌ప్ప‌, పాముల దురాక్ర‌మ‌ణ ప్ర‌పంచానికి తెలియ‌దు. నిచ్చెన ఎక్కిన వాడి గురించే అంద‌రూ మాట్లాడుతారు. నిచ్చెన త‌యారు చేసిన వాడు ఎవ‌రికీ తెలియ‌దు.

విజ‌యం అంటే ప‌ది మంది క‌ష్టం మీద పైకి ఎద‌గ‌డ‌మే. నెత్తిన క‌ళ్లు ఉన్న‌పుడు ఆకాశం త‌ప్ప ఇంకేమీ క‌న‌ప‌డ‌దు. భూమ్యాక‌ర్ష‌ణ అంటే ఎంత‌టి వాడినైనా నేల‌మీద‌కి దించ‌డ‌మే.

అద్భుత జ్ఞాప‌క‌శ‌క్తి వుంటేనే నాయ‌కుల‌వుతారు. రోజూ వేలాది అబ‌ద్ధాలు ఆడేవాడికి ఎక్క‌డ ఏ అబ‌ద్ధం చెప్పాడో గుర్తుండాలి. లేదంటే వీడియోల‌కి దొరికిపోతారు.

బాధ‌ని గుర్తించిన వాడికే సంతోషం విలువ తెలుస్తుంది అంటుంది సామ‌వేదం. దుఃఖాన్ని గుర్తు ప‌ట్టాలంటే మూడో క‌న్ను వుండాలి. గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటికంటి వాన్ని కూడా బ‌త‌క‌నివ్వ‌రు. ఇక మూడో క‌న్ను వుంటే?

క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు నీళ్లు త‌క్కువ తాగు. క‌న్నీళ్లు కొంచెమైనా త‌గ్గుతాయి.

జీఆర్ మ‌హ‌ర్షి

15 Replies to “హీరోలు మాయ‌మై…!”

  1. పానుగంటి లోకనాథరావు గారు… మీ కడప నెంబర్ ఏంటీ? 🤔

    అయ్యయ్యో! ఎప్పుడూ ఫుల్ వాల్యూమ్‌లో “పచ్చ—” అనే మంత్రం జపించే మన పానుగంటి గారు, ఇప్పుడు సౌండ్ ఆఫ్? 😲

    ఏమైంది?

    1️⃣ ఒకే ఒక్క ఓటమితో టవల్ వేసేసారా?

    2️⃣ లేదా “ఈ ID వల్ల కష్టం, కొత్త ID లో పుట్టుక” అనే యోచనలో ఉన్నారా?

    3️⃣ ఇంకా “ఇది ప్రజల విజయం కాదు, ప్రజలు మోసపోయారు” అనే థియరీ రాసుకుంటూనే ఉన్నారా?

    మరి ఓటమిని తట్టుకోలేక మౌన దీక్షలోకి వెళ్ళిపోయారా? లేక ఇంకో ఛానల్ తెరచుకుని కొత్త టోన్ లో పిచ్చి ప్రచారం మొదలెట్టారా? ఏదైనా చెప్పండి!

    పార్టీని మద్దతు ఇవ్వడం ఓ విషయం… కానీ మద్దతు కోసం వేరేవాళ్లను తిట్టడం తప్పిదం అని ఇప్పటికైనా అర్థమైందా?

    ఒకటే ప్రశ్న… రాజకీయ విశ్వాసానికి మీ సంస్కారం తాకట్టు పెట్టాల్సిన అవసరమా?

    ఇప్పటికైనా మారండి!

    🔹 మద్దతు ఇవ్వండి, కానీ మర్యాదగా!

    🔹 వాదించండి, కానీ సంస్కారం వదలకండి!

    🔹 ఓటమి తాత్కాలికం… కానీ మీ తిట్లు శాశ్వతం! 😆

    ఇకనైనా బయటికి రండి, పాత ID ని పాడె పెట్టకుండా, కొత్త వ్యక్తిత్వంతో కనపడండి! 🤣👏

  2. పాపం , ఏం రాస్తున్నాడో ఎందుకు రాస్తున్నాడో ?? ఎవరికోసం రాస్తున్నాడో ? జీతం వస్తుందో రాదో ? ఇస్తాడో లేదో? సరిపోతుందో లేదో?

  3. మీరు రాసేది చూస్తుంటే అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో ఎంఎస్ నారాయణ కేరక్టర్ గుర్తుకు వస్తుంది సర్…..

  4. You mean people sacrificed their life’s for dharma are useless fellows?. The people who sacrifice for their life’s are inspiration to others to come forward to protect dharma. Make sense in what you writing. At least think twice. MBS prasad stopped writing articles, he irritated readers with foolishness. Now this writer took the opportunity

  5. అవును, గుడ్డి వాళ్ళ రాజ్యంలో మూడో కన్ను ఉంటే ఏమవుతుందో, ఇక్కడ కామెంట్స్ పెట్టేవాళ్లను చూస్తేనే అర్ధమవుతుంది

Comments are closed.